బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:55:17

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు

అహ్మద్‌నగర్‌,సెప్టెంబర్‌25: దేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం విజయనగర్‌ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గోల్కొండ , నాంపల్లి జోన్ల పరిధిలో ఈ యేడు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, షీల్డులు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.  కార్యక్రమంలో డిప్యూటీ ఐవోఎస్‌లు ఆర్‌.శ్రీనివాస్‌ రెడ్డి , బి.శివరాంప్రసాద్‌ , రాధ , హెచ్‌ఎం శంకరయ్య, అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు  పాల్గొన్నారు.


logo