e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home హైదరాబాద్‌ భయపడొద్దు..అవగాహన పెంచుకోవాలి

భయపడొద్దు..అవగాహన పెంచుకోవాలి

రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 19: ఎంతోమంది పాము కాటు బాధితులు భయం, షాక్‌లతోనే మరణిస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. పాముదాడిలను నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ సే ్నక్‌ బైట్‌ అవర్‌నెస్‌ డేను పురస్కరించుకుని ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌ (ఐహెచ్‌డబ్ల్యూ) కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో పాముకాటుపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ 2000 నుంచి 2019 మధ్య కాలంలో 12 లక్షల మంది పాముకాటుతో మరణించారని చెప్పారు. పేరుకుపోయిన వర్షం నీళ్లలో నడవడం ప్రమాదకరమని, చనిపోయిన పాముల కోరల కారణంగా శరీరాల్లోకి విషం చేరి మరణించిన వంటి ఉదంతాలు కూడా ఉన్నాయన్నారు. వస్తువులను నిల్వ చేసిన చోట నిద్రించవద్దని చెప్పారు. దోమ తెరలను ఉపయోగించడం ద్వారా దోమలతోపాటు పాముల నుంచి కూడా రక్షణ పొందవచ్చునన్నారు. అనంతరం భారత్‌ సిరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్‌ లిమిటెడ్‌ సీఈవో విశ్వానాథ్‌ స్వరూప్‌ మాట్లాడతూ పాము కాటుకు సులభ పరిష్కారాలు అందించే వీలుందని చెప్పారు. ఐహెచ్‌డబ్ల్యూ కౌన్సిల్‌ అడ్వకసీ అండ్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నాయక్‌ కౌశిక్‌ తదితరులు
పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement