బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 23, 2020 , 00:39:49

ఆత్మగౌరవానికి ప్రతీకలు

ఆత్మగౌరవానికి ప్రతీకలు

అగ్గిపెట్టెలు.. కట్టు కథలు!

పేదల గృహాలపై రాజకీయం

గతంలోనూ 71శాతం ఇండ్లు గ్రేటర్‌ వెలుపలే నిర్మాణం

భూత్‌ బంగ్లాలను తలపిస్తున్న గృహకల్ప, వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు

ఖర్చు రూ.3 లక్షలు.. లబ్ధిదారుల వాటా 30 శాతం

పూర్తి కాని నిర్మాణాలు.. జరగని కేటాయింపులు

ఇప్పటికీ ఖాళీగానే 10వేల గృహాలు 

గ్రేటర్‌లోనే లక్ష ఇండ్లు నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు

సకల సౌకర్యాలతో పేదలకు పూర్తి ఉచితంగా గృహాలు

ప్రస్తుతం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వ్యయం ఒక్కో యూనిట్‌కు రూ. 8.5 లక్షలు

నవ్విపోదురు గాక.. నాకేంటి అన్నట్లు ఉన్నది హస్తం నేతల తీరు. నాడు పేదలకు సొంతింటి కలను నెరవేరుస్తామని గొప్పలు చెప్పి.. అగ్గిపెట్టెలను అంటగట్టారు. లబ్ధిదారులు వాటా చెల్లించడం లేదని.. కమీషన్లకు కక్కుర్తిపడి ఇండ్లు అమ్ముకున్నారు. పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు వారి పేర్లతో పథకాలు పెట్టి.. మాటలతో కోటలు కట్టారు. పేదలకు పిట్టగూళ్ల లాంటి ఇండ్లు కట్టించి.. వాటినీ మధ్యలోనే వదిలేసిన ఘనులు వారు. ఫలితంగా సొంతింటి కల నెరవేరక ఎంతో మంది కిరాయి

ఇండ్లలోనే బతుకు నెట్టుకొస్తున్నారు. చెప్పుకోవడమే తప్పితే.. ‘చేత’కాని వారంతా ఇప్పుడు బురద రాజకీయాలకు దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలను చూసి జీర్ణించుకోలేక.. డబుల్‌ ఇండ్లపై లేనిపోని ఆరోపణలు  చేస్తున్నారు. పేదలు సొంతింట్లో.. ఆత్మగౌరవంగా బతకాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. అందుకే సకల వసతులతో కూడిన విశాలమైన రెండు పడకల ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నది. ఆకాశ హర్మ్యాలను తలపించే ఈ భవనాలను చూసి కాంగ్రెస్‌ నేతలకు మతిభ్రమించింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ‘ఇంటి’ రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

     - ఎస్‌.కిశోర్‌, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

పేదలకు మేడలు నిర్మిస్తామని గాలిమాటలు చెప్పి అగ్గిపట్టెల మాదిరి ఇండ్లను కట్టించారు. అందులోనూ 30శాతం వాటా లబ్ధిదారులనుంచి కట్టించుకున్నారు. ఇంకా వేలాది ఇండ్లు కేటాయింపులు పూర్తికాక భూత్‌బంగ్లాలను తలపిస్తున్నాయి. ఇది తెలంగాణ ఏర్పడకముందు నగర వాసులకు కాంగ్రెస్‌ పాలకులు కట్టించిన ఇండ్ల పరిస్థితి. గ్రేటర్‌లోని పేదలకోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లపై గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయం నగరవాసులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ పార్టీ నేతల అవగాహనా రాహిత్యంపై పలువురు నవ్వుకుంటున్నారు. గ్రేటర్‌లోని పేదలకోసం శివారు ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించడంపై నానా యాగీ సృష్టిస్తున్న ఆ పార్టీ నేతలు, గతంలో వారి పాలనలో ఇండ్లు ఎక్కడ నిర్మించారో, ఎన్ని నిర్మించారో, ఎలా నిర్మించారో, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా హంగామా సృష్టించడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రానున్న గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా ఆ పార్టీ చౌకబారు ఎత్తుగడలకు దిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 

ఆనాడే బస్సులు పెడతామన్నారు

అబ్దుల్లాపూర్‌మెట్‌ వంటి సుదూర ప్రాంతాలనుంచి పేదలు నగరానికి పనులు చేసుకునేందుకు ఎలా వస్తారనే ప్రస్తావన అప్పుడు కూడా వ్యక్తమైంది. దీనిపై అప్పటి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీవీఎస్‌కే శర్మ మాట్లాడుతూ, దూర ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తున్నప్పటికీ అక్కడ ఉండేవారికి రవాణా సమస్య తలెత్తకుండా ఆయా కాలనీలనుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో నగరానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మున్సిపల్‌ శాఖ మంత్రులు సైతం ఇదే విషయాన్ని పలుమార్లు సమీక్షా సమావేశాల్లో వివరించారు. నగరంలో సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, అయినప్పటికీ లబ్ధిదారులకు ఎటువంటి లోటు లేకుండా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వారు అభయమిచ్చారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నాయకులు తమ హయాంలో చేసిన పనులు మర్చిపోయి రాద్ధాంతం చేయడం విశేషం.

వాటా చెల్లించక నిలిచిన కేటాయింపులు

గతంలో నిర్మించిన ఇండ్ల విశేషాలను పరిశీలిస్తే, ఈ ఇండ్లలో ఒక హాలు, వంటగది కలిపి ఒక్కో యూనిట్‌ వైశాల్యం కేవలం 220నుంచి 260 చదరపు అడుగులలోపు మాత్రమే. అగ్గిపెట్టెలను తలపించే ఈ ఇండ్లకు అయిన వ్యయం ఒక్కో యూనిట్‌కు రూ.లక్ష నుంచి రూ.3లక్షలు. మొదట్లో నిర్మించిన ఇండ్లకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరు కాగా, అనంతరం నిర్మించిన ఇండ్లకు రూ.రెండున్నర నుంచి మూడు లక్షల వరకు మంజూరుచేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 35శాతం చొప్పున భరించగా, మిగిలిన 30శాతం లబ్ధిదారులు చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. అయితే, లబ్ధిదారులు వాటా చెల్లించడంలేదని సుమారు 10వేల ఇండ్ల కేటాయింపును నిలిపివేశారు. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ వంటి కాలనీల్లో ఎవ్వరూ ఉండక భూత్‌బంగ్లాలుగా మారిపోయాయి. చాలా కాలనీల్లో కాపలా లేకపోవడంవల్ల తలుపులు, కిటికీలు, పైపులు, నల్లాలు, బండలు చోరీకి గురయ్యాయి.

డబుల్‌ఇండ్ల విశేషాలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 560చదరపు అడుగుల వైశాల్యంలో ఇండ్లను నిర్మించింది. ఒక్కో ఇంటికి మౌలిక సదుపాయాలు కలిపి సుమారు రూ.8.5లక్షలు ఖర్చుచేశారు. ఇందులో లబ్ధిదారు నుంచి ఒక్క పైసా వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అంతేకాదు, కాలనీల్లో పార్కులు, మంచినీరు, మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేశారు. మేజర్‌ కాలనీల్లో మార్కెట్లను కూడా ఏర్పాటుచేశారు. పై అంతస్తుల్లో ఉండేవారి సౌకర్యార్థం లిఫ్టులను కూడా నిర్మించారు. గతంలో నిర్మించిన ఇండ్లకు, ప్రస్తుతం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు ఎటువంటి పొంతనా లేదు. ఈ కాలనీలన్నీ రవాణా వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లోనే నిర్మించారు. అక్కడ ఉండేవారికి రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఏర్పాటైన అనంతరం, అంటే 2007 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి గ్రేటర్‌లోని పేదలకోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే, రాజీవ్‌ ఆవాస్‌ యోజన తదితర పథకాల కింద 52,159 ఇండ్లను నిర్మించాయి. ఇందులో 45,295 ఇండ్లు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మించగా, 6,608 వాంబే, 256 ఇండ్లు రాజీవ్‌ ఆవాస్‌ యోజన కింద నిర్మించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లోని 90ప్రాంతాల్లో దశలవారీగా 45,295 ఇండ్లను నిర్మించగా, అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 46 ప్రాంతాల్లో 13,169 గృహాలను, బల్దియా వెలుపల 44 ప్రాంతాల్లో 32,126 ఇండ్లను నిర్మించారు. గ్రేటర్‌లోని పేదలకోసం నిర్మించిన మొత్తం ఇండ్లలో సుమారు 71శాతం ఇండ్లు గ్రేటర్‌ వెలుపల రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మించడం విశేషం. ఇదే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువశాతం ఇండ్లను శివారు ప్రాంతాల్లోనే నిర్మించింది. అయినప్పటికీ వాటిలో 90శాతం గ్రేటర్‌లోని పేదలకు, మిగిలిన 10శాతం మాత్రమే స్థానికులకు కేటాయించనున్నట్లు ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టినప్పుడే ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేసింది. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నానా రాద్ధాంతం చేస్తుండటం గమనార్హం.

వందల కోట్లు వృథా

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారం సర్వేనంబర్‌ 79లోని సుమారు 28 ఎకరాల స్థలంలో ‘రాజీవ్‌ స్వగృహ’ ఇండ్ల నిర్మాణాన్ని 2008లో ప్రారంభించారు. 2,800 ఇండ్ల కోసం రూ.428 కోట్లు కేటాయించారు. 2013 నాటికి కేవలం 5 బ్లాకుల్లో 50 శాతం పనులే పూర్తయ్యాయి. దీంతో సుమారు రూ.100 కోట్లు వృథా అయ్యాయి.

2008లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ఉప్పుగూడ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీలో 304 ఇండ్లు నిర్మించారు. ఇందులో ఇప్పటికీ 110ఇండ్లు ఖాళీగా ఉండగా.. గౌస్‌ నగర్‌లో 324, తాళ్లకుంటలో 128 ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. 

రాంగోపాల్‌పేట డివిజన్‌లోని గైదిన్‌బాగ్‌లో 2009లో రూ.14 కోట్లతో నిర్మించతల పెట్టిన నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. బేగంపేట డివిజన్‌లోని పాటిగడ్డ, ఎంబీటీనగర్‌లో సుమారు 90 ఇండ్లను సగం వరకు నిర్మించి వదిలేశారు.

దమ్మాయిగూడ మున్సిపల్‌ అహ్మద్‌గూడ గ్రామ పరిధిలో 4512 ఇండ్లు నిర్మించారు. ఇరుకు గదులు, నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో 25 శాతం ఇండ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.

బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధి ఇందిరానగర్‌ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఆల్విన్‌కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2010-12 మధ్య 4వేలకు పైగా ఇండ్లు నిర్మించారు. ఇందులో చాలా వరకు లబ్ధిదారులకు కేటాయించకపోగా.. ఇప్పటికే ఈ నివాసాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సరైన డ్రైనేజీ  వ్యవస్థ లేక, నానా ఇబ్బందులు పడుతున్నారు.

శంషాబాద్‌ మండలం రాళ్లగూడ పరిధి ఇంద్రారెడ్డినగర్‌లో 336, బీసీ కార్పొరేషన్‌ సమీపంలో 240, సాతంరాయిలో 600 ఇండ్లు నిర్మించి పూర్తి చేశారు. పాలమాకులలో 784, హుడాకాలనీలో 384 ఇండ్ల నిర్మాణ పనులను అసంపూర్తిగానే వదిలేశారు.

2007-14మధ్య గ్రేటర్‌లో నిర్మించిన

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో..

కాలనీ నిర్మించిన

  ఇండ్లు

అఫ్జల్‌సాగర్‌ 204

బన్సీలాల్‌పేట్‌ 42

ఫిలింనగర్‌ 20

గొల్లకొమురయ్య కాలనీ 32

కూకట్‌పల్లి 64

బండ్లగూడ

సర్వే నం.128 48

నందనవనం-1 1638

తిరుమలగిరి సర్వే నం.

77/పి, 82/పి 336

ఏసీఎస్‌ నగర్‌ 192

అన్నానగర్‌ 160

బండ్లగూడ సర్వే నం-82 432

బండ్లగూడ సర్వే నం-83 112

బతుకమ్మకుంట 64

చంద్రకిరణ్‌ బస్తీ 32

చీపురుబస్తీ 32

చిలకలగూడ(దూద్‌బావి) 24

చంద్రబాబునాయుడునగర్‌ 160

ఫిలింనగర్‌ 24

గాంధీనగర్‌ పికెట్‌ 160

గైడెన్‌బాగ్‌ 32

హమాలీబస్తీ 276

కస్తూర్బానగర్‌ 104

ముత్యాలమ్య టెంపుల్‌ 32

నందనవనం-2 178

ఎన్‌బీటీ నగర్‌ 64

ఓల్డ్‌ పాటిగడ్డ 176

పంజాగుట్ట దోబీఘాట్‌ 128

పటేల్‌నగర్‌-2 160

ఫూల్‌బాగ్‌ 608

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-46 64

సంజీవయ్యనగర్‌ 32

శాస్త్రీనగర్‌ 16

ఉన్నికోట 464

ఉప్పుగూడ 304

వీరన్నగుట్ట-2 160

శంషీగూడ 3212

శంషీగూడ(మూసీ రివర్‌) 64

రంగారెడ్డి జిల్లా పరిధిలో..

కర్మాన్‌ఘాట్‌-3 512 

మేడ్చల్‌ జిల్లా పరిధిలో..

గాజులరామారం 272

ఖైత్లాపూర్‌ 264

ఛత్రపతి శివాజీనగర్‌ 167

చర్లపల్లి 1200

మల్లాపూర్‌ 256

మల్లాపూర్‌-2 512

ఉప్పల్‌ 144


జీహెచ్‌ఎంసీ

వెలుపల నిర్మించిన

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం..

రంగారెడ్డి జిల్లా పరిధిలో..

మునగనూర్‌-1 368

గంధంగూడ-1 216

గంధంగూడ-2 360

కోకాపేట్‌ 312

పీరంచెరువు 840

పుప్పాలగూడ 432

సాతంరాయి 600

శంషాబాద్‌-1 240

సాతంరాయి-2 336

సాతంరాయి-3 384

శంషాబాద్‌-4 384

శంషాబాద్‌-5 96

కోకాపేట్‌-2 160

గంధంగూడ-3 192

చిల్కూర్‌ 992

పాలమాకుల-2 160

పాలమాకుల-1 624

అబ్దుల్లాపూర్‌మెట్‌ 4992

తుర్కయంజాల్‌ 640

కుత్బుల్లాపూర్‌ 264

కుర్మల్‌గూడ 480

తుర్కయంజాల్‌-2 96

కుర్మల్‌గూడ-2 992

అబ్దుల్లాపూర్‌మెట్‌-2 624

కుర్మల్‌గూడ-3 2606

తుర్కయంజాల్‌-3 640

మేడ్చల్‌ జిల్లా పరిధిలో..

బాచుపల్లి 2280

బౌరంపేట 3024

మల్లంపేట-1 360

మల్లంపేట-2 216

నిజాంపేట-1 1392

నిజాంపేట-2 600

బహదూర్‌పల్లి-2 528

బౌరంపేట-2 320

నిజాంపేట-3 304

జవహర్‌నగర్‌ 528

చీర్యాల్‌ 480

రాంపల్లి దాయర 480

చీర్యాల్‌-2 216

అన్నోజిగూడ 68

జవహర్‌నగర్‌-2 432

అన్నోజిగూడ-2 128

సంగారెడ్డి జిల్లా పరిధిలో..

అమీన్‌పూర్‌ 848

రామేశ్వరం బండ 1792


వివిధ పథకాల్లో నిర్మించినవి..!

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 13169

జీహెచ్‌ఎంసీ వెలుపల 32126

వాంబే పథకం 6608

రాజీవ్‌ ఆవాస్‌ యోజన 256

మొత్తం 52159

కేటాయింపు పూర్తికానివి 10209


logo