శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 20, 2021 , 02:31:59

శివ నిస్వార్థ సేవలు అభినందనీయం

శివ నిస్వార్థ సేవలు అభినందనీయం

  • సినీ నటుడు సోనూసూద్‌

కవాడిగూడ, జనవరి 19: ‘ట్యాంక్‌బండ్‌ శివ’ నిస్వార్ధంగా సమాజానికి సేవలందించడం అభినందనీయమని, ఇలాంటి సేవలందించేందుకు ఎం తో మంది యువత స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ అన్నారు. ‘శవాల శివ’ కొనుగోలు చేసిన అంబులెన్స్‌కు ట్యాంక్‌బండ్‌ పైనున్న అమ్మవారి ఆలయంలో పూజలు జరిగాయి. ఇందుకు నటుడు సోనూసూద్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌లు హాజరయ్యారు. గుర్తు తెలియని శవాలను హుస్సేన్‌సాగర్‌లో నుంచి వెలికితీస్తూ శివ గత కొంత కాలంగా సమాజ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ‘శవాల శివ’ అని కూడా స్థానికులు సంబోధిస్తున్నారు. తాను చేసే సేవలకు అనుగుణంగా విరాళాలు సేకరించేవారు శివ. 

ఈ నేపథ్యంలోనే తనకు వచ్చిన విరాళాలతో ఎదుటివారికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇటీవల ఒక అంబులెన్స్‌ను సైతం కొనుగోలు చేశారు. ఆ అంబులెన్స్‌ను సినీ నటుడు సోనూసూద్‌, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అమ్మవారికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ ఆపద సమయంలో ఉన్నవారిని ఆదుకోవడానికి శివ చేస్తున్న కృషిని ఆయన అభినందనీయమన్నారు. ఎవ్వరూ చేయలేని సేవలతో శివ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నగర విభాగం నాయకుడు ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo