రూ.2.15లక్షలకే స్విఫ్ట్ డిజైర్ అంటూ బురిడీ

హైదరాబాద్ : తక్కువ ధరకే కారును విక్రయిస్తామని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్‌లో ప్రకటన వేసి.. నగర యువకుడిని బోల్తా కొట్టించిన ఏడుగురు భరత్పూర్ గ్యాంగ్ ముఠా సభ్యులను గురువారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే...హైదరాబాద్ కార్వాన్ ప్రాంతానికి చెందిన అభిలాష్ ప్రైవేటు ఉద్యోగి. తన స్మార్ట్‌ఫోన్‌లో బ్రౌజ్ చేస్తుండగా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్‌లో స్విఫ్ట్ డిజైర్ కారును రూ.2.15 లక్షలకే విక్రయిస్తున్నట్లు ఉండగా ఆశపడ్డాడు. దీంతో అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించగా.. అవతలి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నానని చెప్పాడు. కారును ట్రయల్ చూడాలంటే ముందుగా రూ.3,100 చెల్లించాలని ఎయిర్‌పోర్టు సర్వీస్ ఆర్మీ ట్రాన్స్‌పోర్టు ఫారంను పంపాడు. దీంతో అభిలాష్ ఆ డబ్బులను గూగుల్‌పే చేశాడు. కారు ట్రయల్‌కు రాలేదని అనగా... మొత్తం నగదును చెల్లిస్తేనే కారును అరగంటలో పంపిస్తానని చెప్పగా.. అభిలాష్ మరో రూ.1.56 లక్షలు పంపించాడు. ఎంతకీ కారు రాలేదని అడుగగా.. తాను డ్యూటీలో ఉన్నానని, మరుసటి రోజు పంపిస్తానని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా సైబర్‌క్రైం ఇన్స్పెక్టర్ నవీన్ బృందం.. మోసానికి పాల్పడింది రాజస్థాన్ భరత్‌పూర్‌లోని నాగ్లా కుందన్ గ్రామానికి చెందిన ఏడుగురిని గుర్తించారు. వీరిని అప్పటికే అక్కడి జురేహ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు నాంపల్లి కోర్టులో పిటీ వారెంట్‌ను దాఖలు చేసి ఈ ఏడుగురు నిందితులను గురువారం సిటీకి తీసుకువచ్చి రిమాండ్‌కు పంపారు. అరస్టైన వారి లో అజ్రుద్దీన్ ఖాన్, హాసన్‌ఖాన్, అలీ మొహ్మద్, అక్తర్‌ఖాన్, సద్దాం ఖాన్, షోయబ్ ఖాన్, సద్దాం ఉన్నారు.
తాజావార్తలు
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య