సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 09, 2020 , 00:52:59

స్వర్గపురి వాహనాన్ని ఉపయోగించుకోవాలి

స్వర్గపురి వాహనాన్ని ఉపయోగించుకోవాలి

మంత్రి చామకూర మల్లారెడ్డి 

రామంతాపూర్‌ : ఉప్పల్‌ పట్టణ ప్రజలకు ఉచిత సేవలందించేందుకు స్వర్గపురి వాహనం ఉపయోగపడుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకుడు మేకల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గపురి వాహనాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేకల మధుసూదన్‌రెడ్డి స్వర్గపురి వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, గ్రామ పెద్దలు రాజిరెడ్డి, సల్లవీరారెడ్డి, బజార్‌ జగన్‌గౌడ్‌, గోనె అర్జున్‌రెడ్డి, ఆకుల మహేందర్‌, గూడ మధుసూదన్‌రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, అంజయ్య, బన్నాల ప్రవీణ్‌ కార్పొరేటర్‌ మేరు సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు వీల్‌ చైర్లు అందజేత

దివ్యాంగులను అందరూ ప్రేమతో చూడాలని మంత్రి అన్నారు. ఉప్పల్‌లో దివ్యాంగులకు వీల్‌ చైర్లను స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి అందజేశారు. 

logo