బంజారాహిల్స్,మే 29: సహజీవనం చేస్తున్న యువతితో విబేధాలు రావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. అయితే.. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువతి కూడా ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని యాదగిరినగర్‌లో నివాసం ఉంటున్న బి.బాలాజీ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే ప్రాంతంలో అద్దె గదిలో ఉంటూ.. సినీపరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న యువతి(20)తో అతనికి పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది.
దీంతో ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. వారంరోజుల్లో బాలాజీకి 18ఏండ్లు పూర్తి కాగానే పెండ్లి చేసుకోవాలనుకున్నారు. కాగా.. వారిద్దరి మధ్య రెండుమూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. క్షణికావేశానికి లోనై బాలాజీ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, నీలిమ చున్నీతో గొంతుకు బిగించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు స్థానికు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం మార్చురీకి తరలించారు. యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.