ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:53:05

పాలిటెక్నిక్‌ విద్యార్థులకుస్టడీ మెటీరియల్‌

పాలిటెక్నిక్‌ విద్యార్థులకుస్టడీ మెటీరియల్‌

పంపిణీ చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్ష రాయనున్న మహేశ్వరం నియోజకవర్గం విద్యార్థులకు ఇంద్రారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌, మోడల్‌ పేపర్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉచితంగా పంపిణీచేశారు. బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సోమవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ మెటీరియల్‌ విద్యార్థులకు ఎంతగానే ఉపయోగపడుతుందని, ప్రణాళికాయుతంగా చదివి రాణించాలన్నారు. వృత్తి విద్యా కోర్సులకు మంచి డిమాండ్‌ ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రెటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పాల్గొన్నారు.


logo