సోమవారం 06 జూలై 2020
Hyderabad - Jun 02, 2020 , 05:02:00

తెలంగాణలో పటిష్ట శాంతిభద్రతలు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

తెలంగాణలో పటిష్ట శాంతిభద్రతలు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

హైదరాబాద్ : నూతన తెలంగాణ రాష్ట్రంలో.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సత్ఫలితాలిస్తున్నది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పటిష్ట చర్యలతో భద్రమైన వాతావరణం నెలకొన్నది. నేరాలు, సెటిల్‌మెంట్లు పూర్తిగా తగ్గిపోయాయి. తాజాగా కొవిడ్‌-19లో లాక్‌డౌన్‌ పోలీసింగ్‌ పోలీసులకు, పౌరులకు సరికొత్త అనుభవాన్ని తీసుకువచ్చింది.  

 సాంకేతికతతో..

అత్యాధునిక టెక్నాలజీతో పెట్రోలింగ్‌ వ్యవస్థను ఆధునీకరించారు. హాక్‌ ఐ, హైదరాబాద్‌ కాప్స్‌, లాస్ట్‌ రిపోర్టు, సోషల్‌ మీడియాలోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లతో ప్రజలకు ఆన్‌లైన్‌లో మరింత చేరువయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌  9490616555, సైబరాబాద్‌ వాట్సాప్‌-9490617444, రాచకొండ పోలీసు వాట్సాప్‌-9490617111, డయల్‌ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. 

 సీసీ కెమెరాలతో కేసుల ఛేదన..

నగరంలో నేను సైతం కింద లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ నేరం జరిగినా కేసులను ఛేదిస్తున్నారు. గంటల్లోనే ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకుంటున్నారు.  పాపిలాన్‌ టెక్నాలజీతో నేరస్తుల వేలు ముద్రలను భద్రపర్చుకున్నారు.

 మహిళల భద్రతకు ప్రాధాన్యం

షీ టీమ్‌లు మహిళలకు భద్రతకల్పిస్తున్నాయి. వారు కాల్‌ చేస్తే చాలు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా హైవే పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. భరోసా కేంద్రాల్లో  ఒకే చోట పోలీసు, న్యాయ, వైద్య సేవలతో పాటు బాలలకు అదే ఆవరణలో న్యాయసేవలు అందించేందుకు ప్రత్యేక కోర్టు  ద్వారా సేవలందిస్తున్నారు. 

  రోడ్డు ప్రమాదాల  నివారణ..

ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు ప్రమాదాల్లో చోటు చేసుకుంటున్న మరణాలను 50 శాతం మేర తగ్గించారు.  ట్రాఫిక్‌ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు.  

మనదే బెస్ట్‌ సిటీ

దేశంలోని ప్రధాన పట్టణాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, తదితర నగరాల కంటే హైదరాబాద్‌ శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 

-అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

శిక్ష పడేలా దర్యాప్తు

 నేరగాళ్లను విడిచి పెట్టేది లేదు. నేరగాళ్లకు శిక్ష పడేలా పటిష్టంగా దర్యాప్తు చేస్తున్నాం. అంతర్రాష్ర్టాల నేరగాళ్ల ను కట్టడి చేశాం. హాజీపూర్‌ సంఘటనలో నిందితుడికి  ఉరి శిక్ష పడేలా విచారణను ముగించాం. 

-మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌

మెరుగైన పోలీసింగ్‌

ప్రభుత్వం అందించిన సౌకర్యాలతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీసింగ్‌ను అందిస్తున్నాం. ఐటీ కారిడార్‌లో భద్రతను పటిష్టం చేశాం. లాక్‌డౌన్‌ పోలీసింగ్‌ కొత్త అనుభవాన్ని నేర్పింది.-సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ 


logo