తెలిసినా నిర్లక్ష్యమే

- రోడ్డు నిబంధనలు బేఖాతర్
- సిగ్నల్ పడినా ఆగరు, రాంగ్రూట్లో డ్రైవింగ్
- తొందరపాటుతో తరచూ ప్రమాదాలు
- గమనించడం.. ఆలోచించడం.. పనిచేయడం..
- రోడ్డు డ్రైవింగ్‌లో .. కీలకమంటున్న అధికారులు
- నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు.. అయినా.. నిబంధనలు బేఖాతర్
- ఎల్‌ఎల్‌ఆర్‌లో రోడ్డు చిహ్నాలు, డ్రైవింగ్ సూత్రాలతో అనేక ప్రశ్నలు
- లైసెన్స్ పొందాలంటే వీటిపై అవగాహన తప్పనిసరి
- తెలంగాణ ఆర్టీఏ వెబ్సైట్లో రోడ్డు నిబంధనలపై మెటీరియల్
‘గుంతల రోడ్డు ప్రాణం తీసింది.. పొగమంచు ప్రమాదానికి కారణమైంది.. ఓవర్ స్పీడ్‌తో ప్రాణాలు బలి.. సిగ్నల్స్ బేఖాతరు..’ ఇలా అనేక కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వాహనం ఎలా నడపాలి? ప్రమాదాలు జరుగకుండా డ్రైవింగ్ ఎలా చేయాలి? అనే విషయాలపై లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. రోడ్డు నిబంధనలు తెలిసిన వారికే ఆర్టీఏ అధికారులు లైసెన్స్ జారీ చేస్తారు. కానీ ఆ నిబంధనలేవీ పాటించకుండా వాహనదారులు ప్రాణాలమీదుకు తెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగుల్చుతున్నారు. లైసెన్స్ పొందడానికి అధికారుల ముందు చూపించిన శ్రద్ధ.. ఆ తర్వాత రోడ్డు మీదకొచ్చాక బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా రోడ్లు నెత్తురోడుతున్నాయి.
సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : 94 రోడ్డు చిహ్నాలు.. 159 రోడ్డు నిబంధనలు.. మరో 159 డ్రైవింగ్ సూత్రాలు.. ఒక వ్యక్తి ప్రమాదం జరుగకుండా డ్రైవింగ్ చేయాలంటే వీటన్నింటిపై కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే. అంతేకాదు ఇవి తెలిస్తేనే లైసెన్స్. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా ఉండాలంటే ట్రాఫిక్, రోడ్డు, సిగ్నల్స్ నిబంధనలపై అవగాహన తప్పనిసరి. అందుకే లైసెన్స్ పొందడంలో ఆర్టీఏ అధికారులు అనేక ప్రశ్నలతో వాహనదారుడికి పరీక్ష నిర్వహిస్తారు. జంక్షన్లో ఎదురుగా ఎరుపు రంగు సిగ్నల్ కనిపిస్తే ఏం చేయాలి? త్రికోణంలో ఉన్నగుర్తు దేనికి సంకేతం? పొగమంచు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రయాణించాల్సివస్తే మీరేం చేస్తారు? రోడ్డు మధ్యలో విరిగిన తెల్ల గీత దేనిని సూచిస్తుంది? స్టాప్‌లైన్ సమీపించే సమయంలో సిగ్నల్ లైట్ పసుపు పచ్చ రంగుకు మారితే ఏం చేస్తారు? వాహనాన్ని నడుపుతూ హఠాత్తుగా ఆగాలనుకుంటే చేతితో సూచించే పద్ధతి ఏదీ? ఇలా వందల ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిస్తేనే లైసెన్స్ పొందే వీలుంటుంది.
నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం
ఆన్లైన్లో మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది. తెలంగాణ ఆర్టీఏ వెబ్సైట్లో ప్రతి సమాచారం ఉంచాం. రోడ్డు నిబంధనలపై అవగాహన అందరికీ అవసరం. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. వాహనం ఎలా నడపాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటిపై వాహనదారులకు రోడ్డు భద్రత మాసోత్సవంలో అవగాహన కల్పిస్తున్నాం. వాహనదారులందరూ రోడ్డు, ట్రాఫిక్, చిహ్నాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
- ఎం.ప్రవీణ్ రావు, డీటీఓ, రంగారెడ్డి
తాజావార్తలు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
- గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో
- రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్
- ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
- బెంగాల్ పోరు : నందిగ్రాం బరిలో దీదీపై సువేందు అధికారి పోటీ!
- వాణీదేవి గెలుపే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం
- అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరుపై సమీక్ష
- పైలట్‌పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు