బుధవారం 23 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:24:58

దశలవారీగా అభివృద్ధి పనులు

 దశలవారీగా అభివృద్ధి పనులు

 మల్లాపూర్‌/కాప్రా, ఆగస్టు 10: ఉప్పల్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని కాలనీల్లో అభివృద్ధిపనులను దశలవారీగా చేపడుతున్నట్టు  ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం హెచ్‌బీకాలనీ డివిజన్‌ డైమండ్‌ హిల్స్‌కాలనీలో రూ.18లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు, మీర్‌పేట్‌లో రూ.7లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీహాలు నిర్మాణ పనులకు కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్యతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిపనులు చేపట్టే సందర్భంగా కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేవిధంగా ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌, వెంకన్నగౌడ్‌, మురళీధర్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రసాద్‌, ఏఈ తిరుమలయ్య, ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌నాయకులు పాల్గొన్నారు. 

 మల్లాపూర్‌డివిజన్‌ మల్లికార్జుననగర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిధులు సమకూర్చడంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి ప్రారంభించారు. రాచకొండ డీసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి, కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి, నాచారం సీఐ కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.     

         సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు అందజేత

కాప్రా, ఆగస్టు 10: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి  ఎంతగానో ఉపకరిస్తున్నదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. అనారోగ్యం కారణంగా వైద్యఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న  మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన కుంటికృష్ణకు రూ.32వేలు, మామిడి ఇందిరకు రూ.48వేలు మంజూరు కావడంతో వారికి మల్లాపూర్‌ కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సోమవారం బాధితులకు చెక్కులను అందజేశారు.


logo