సిటీబ్యూరో, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ)/ శేరిలింగంపల్లి: పలు స్టార్ హోటల్స్‌లో ఇటీవల జరిగిన సంచలనాల సంఘటనల దృష్ట్యా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టార్ హోటల్స్ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని మార్గదర్శకాలను సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అనుమానితుల గుర్తింపుపై పోలీసులు పలు సూచనలు చేశారు.