శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:28:11

కీలక తీర్మానాలకు స్థాయీ సంఘం ఆమోదం

కీలక తీర్మానాలకు స్థాయీ సంఘం ఆమోదం

మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన సమావేశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యూసుఫ్‌గూడ సర్కిల్‌ కార్యాలయానికి నూతన భవనం నిర్మించనున్నారు. దీనికి గురువారం జీహెచ్‌ఎంసీ స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. దీంతోపాటు స్థాయీసంఘం పలు కీలక తీర్మానాలు చేసింది. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈ కింది తీర్మానాలు చేశారు.

  • రూ. 5.95కోట్లతో శేరిలింగంపల్లి జోన్‌లోని యూసుఫ్‌గూడ సర్కిల్‌ కార్యాలయ భవనానికి అనుమతి. యూసుఫ్‌గూడ బస్తీ జంక్షన్‌లో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీహాల్‌ను తొలిగించి దాని స్థానంలో కార్యాలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.
  • నేషనల్‌ అకాడమీ ఆఫ్‌  కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) ద్వారా కాంట్రాక్టు పద్ధతిపై రెండు దశల్లో జీహెచ్‌ఎంసీలో నియమించిన 250మంది సైట్‌ ఇంజినీర్లు (126+124) పనిచేసే గడువును వచ్చే ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ చివరివరకు పొడిగింపు
  • శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిల్‌-20లో ఐఐఐటీ జంక్షన్‌ నుంచి రాడిసన్‌ హోటల్‌ వరకు సెంట్రల్‌ మీడియన్‌లు, ట్రాఫిక్‌ ఐలాండ్‌ల నిర్వహణ బాధ్యతను సీఎస్‌ఆర్‌ కింద డీఎల్‌ఎఫ్‌ సంస్థకు అప్పగింత
  • సర్కిల్‌-20లో హైటెక్స్‌ ఆర్చ్‌ నుంచి హెచ్‌ఐసీసీ మెయిన్‌ గేట్‌ వరకు సెంట్రల్‌ మీడియన్‌లు, ట్రాఫిక్‌ ఐలాండ్‌ల నిర్వహణ బాధ్యతను సీఎస్‌ఆర్‌ కింద స్మైలిన్‌ డెంటల్‌ దవాఖానకు అప్పగింత
  • యాకుత్‌పుర, ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ మధ్య ఆర్‌యూబీ బాక్స్‌ నిర్మాణానికి నిధులను రూ. 6,55,15,057కు పెంచుతూ సవరించిన ప్రతిపాదనకు ఆమోదం.


logo