బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:02:38

రోడ్డు మీద ఉమ్మితే, మాస్కు లేకుంటే.. కోర్టుకే

రోడ్డు మీద ఉమ్మితే, మాస్కు లేకుంటే.. కోర్టుకే

హైదరాబాద్ : మాస్కు ధరించకుండా రోడ్డుపైకొస్తే..  కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. మాస్కు లేనివారిపై సెక్షన్‌ 51 (బీ) డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద ఆన్‌లైన్‌ ఈ-పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. తర్వాత వారిని  కోర్టులో హాజరుపరుచనున్నారు. కోర్టు తీర్పు మేరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మాస్క్‌ ధరించకపోవడం, రోడ్డు మీద ఉమ్మివేయడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపై ఈనెల 11 నుంచి మంగళవారం నాటికి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1049, సైబరాబాద్‌ పరిధిలో 653  ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయి.


logo