e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ ముమ్మరంగా.. స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ముమ్మరంగా.. స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ముమ్మరంగా.. స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌
  • మూడు రోజులు.. 66,668 మందికి టీకాలు
  • నిర్విరామంగా కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
  • ఆదివారం 22,603 మంది నిత్య సేవకులకు టీకా

సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): మహా నగరంలో నిరంతర సేవకులకు స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మూడో రోజైన ఆదివారం 22,603 మందికి టీకాలు వేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైన మొదటి రోజు 21,666 మందికి, శనివారం 22,399 మందికి వ్యాక్సిన్‌ అందించారు. మూడు రోజులకు గాను 66,668 మంది నిత్య సేవలకు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కొవిడ్‌ నిబంధనలతో సజావుగా సాగుతున్నది. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

టీకా విశేషాలు..

  • 30 సర్కిళ్లలో 31 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది.
  • ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టీకాలు వేశారు.
  • మధ్యాహ్నం 12 గంటల వరకు 30 సర్కిళ్లలో 12,257 మందికి టీకా వేశారు.
  • 18 నుంచి 44 ఏళ్ల వారు 9,457 మంది ఉండగా, 45 ఏళ్లు దాటిన వారు 2,800 మంది ఉన్నారు.
  • మధ్యాహ్నం రెండు గంటల వరకు మొత్తం టీకా వేసుకున్న వారి సంఖ్య 18,613కు చేరింది.
  • ఇందులో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వారు 14,421 మంది ఉండగా, 45 ఏళ్లు దాటిన వారు 4,192 మంది ఉన్నారు.
  • సాయంత్రం కార్యక్రమం ముగిసే వరకు మొత్తం 22,603 మందికి వ్యాక్సిన్‌ వేశారు.
  • ఇందులో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వారు 17,588 మంది ఉండగా, 45 ఏళ్లు దాటిన వారు 5,015 మంది ఉన్నారు.
  • అత్యధికంగా కాప్రా సర్కిల్‌లోని కుషాయిగూడ సెంటర్‌లో 949 మంది ఉండగా, అత్యల్పంగా గోషామహల్‌ రెడ్‌రోస్‌ ఫంక్షన్‌ హాల్‌లో 334 మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముమ్మరంగా.. స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ట్రెండింగ్‌

Advertisement