హైదరాబాద్ : గత వారం రోజులుగా నగరంలోని పలు హౌసింగ్ సొసైటీల్లో ప్రత్యేక టీకా డ్రైవ్‌లు జరిగాయి. ఈ క్రమంలో నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కమ్యూన్ ఆదివారం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించింది. అదేవిధంగా జూన్ 5 న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మై హోమ్ విహంగాలో రెండవసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. నివాసితులతో పాటు, హౌసింగ్ సొసైటీల్లో పనిచేసే సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ వేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఎ నర్సింహన్ మాట్లాడుతూ.. హాస్పిటల్ మేనేజ్మెంట్లతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అపర్ణ కమ్యూన్కు చెందిన రాజీవ్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. ఆదివారం 345 మందికి వ్యాక్సినేషన్ లభించిందన్నారు. మరో డ్రైవ్ మంగళవారం జరగాల్సి ఉందని చెప్పారు.