శుక్రవారం 05 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 06:29:36

27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ - మణుగూరు (02745), మణుగూరు - సికింద్రాబాద్‌ (02746), కాచిగూడ - యలహంక (07603), యలహంక - కాచిగూడ (07604), గుంటూరు - రాయగడ(07243), తిరుపతి - ఆదిలాబాద్‌ (07405), ఆదిలాబాద్‌ - తిరుపతి (07405), కాకినాడ పోర్టు - రేణిగుంట (07249) రైళ్లు ఈ నెల 27 నుంచి ప్రతిరోజు నిర్దేశిత మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ పూర్తిగా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

VIDEOS

logo