శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:30:59

రైతుల లఘు చిత్రాల పోటీలకు విశేష స్పందన

రైతుల లఘు చిత్రాల పోటీలకు విశేష స్పందన

ఖైరతాబాద్‌: రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రదర్శనకు వచ్చిన లఘు చిత్రాలు రైతు ల జీవితాలకు అద్దం పట్టేలా ఉన్నాయని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల స్థితిగతులు, మార్కెట్‌ పరిస్థితులపై ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  ‘రైతు నేస్తం-పల్లెపదం’ పేరుతో లఘు చిత్రాల పో టీలకు ఆహ్వానించగా రైతుల నుంచి విశేష స్పం దన లభించింది. సుమారు 47 లఘు చిత్రాలను రైతులు పంపించగా, వాటిని రైతు నేస్తం యూ ట్యూబ్‌ చానెల్‌లో పొందుపర్చారు. ఈ సందర్భం గా ఉత్తమ చిత్రాలను, విజేతలను శుక్రవారం సో మాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వేదికగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వర రావు, జ్యూరీ సభ్యులు, ఆదర్శ రైతు సుఖవాసి హరిబాబులతో కలిసి ప్రకటించారు.  

లఘు చిత్రాల విజేతలు వీరే..

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన బి. ప్రవీణ్‌కుమార్‌ తీసిన ‘శ్రీకారం’ లఘు చిత్రం మొదటి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కడపజిల్లా కాజీపేట మండలం దొంపలగుట్టుకు చెందిన ఆర్‌. వెంకటసాగర్‌ నిర్మించిన ‘రసాయనాలు వాడని రైతే రాజు’ చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా, మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం ఆగపేటకు చెందిన తల్లాడ సాయి కృష్ణ తీసిన ‘మనోగతం’ లఘు చిత్రం మూడో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మొదటి ఉత్తమ చిత్రానికి రూ.లక్ష, రెండో చిత్రానికి రూ.75వేలు, మూడో చిత్రానికి రూ.50వేలు అందిస్తారు. వాటితో పాటు దేశానికి రైతే ప్రాణం, ఓ రైతు కథ, రాజ్యం లేని రాజు చిత్రాలు ప్రోత్సాహక బహుమతులను అక్టోబర్‌లో నిర్వహించే ‘రైతు నేస్తం’ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందచేస్తామని, మిగతా చిత్రాలను నిర్మించిన ప్రతి ఒక్కరికి ధ్రువ పత్రాలు అందజేస్తామని, రైతు నేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పద్మశ్రీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ లఘు చిత్రాలను రైతు నేస్తం యూట్యూబ్‌ చానెల్‌లో వీక్షించవచ్చని చెప్పారు.


logo