బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Jul 31, 2020 , 00:22:20

రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు

రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు

గోల్నాక: అంబర్‌పేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తెలిపారు. గురువారం అంబర్‌పేట డివిజన్‌ న్యూపటేల్‌నగర్‌ నుంచి బాపూనగర్‌ వరకు రూ.30లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్‌ పులిజగన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జి.మల్లేశ్‌యాదవ్‌, విజయ్‌కుమార్‌గౌడ్‌, యాసిన్‌, సిద్దార్థ్‌ ముదిరాజ్‌, సతీశ్‌, లింగారావు, మెట్టు ధన్‌రాజ్‌, మెట్టు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక కృషి

అంబర్‌పేటలోని ముస్లిం శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను ఏఎంహెచ్‌వో హేమలతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ పర్యవేక్షించారు. శ్మశాన వాటికలో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శ్మశాన వాటికలో కరెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ నందనవనంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. 

రేషన్‌ డీలర్లకు చెక్కులు అందజేత

కాచిగూడ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నేరుగా అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసిన ఉచిత బియ్యానికి వచ్చిన కమీషన్‌ చెక్కులను గురువారం కాచిగూడలో ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్య, టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు ఎక్కాల కన్నా కలిసి రేషన్‌ డీలర్లకు అందజేశారు. కార్యక్రమంలో ఏసీఎస్‌వో నాయక్‌, సివిల్‌ సప్లయ్‌ సర్కిల్‌-4 ఇన్‌స్పెక్టర్‌ సావిత్రి, రేషన్‌ డీలర్ల కార్యదర్శి సద్గున, కిట్టు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo