e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్‌, ఆరు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఎస్‌సీఆర్‌ (సౌత్‌ సెంట్రల్‌ రైల్వే) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, గుంతకల్‌, నాందెడ్‌ డివిజన్ల పరిధిలో సోమవారం నుంచి సామాన్యుల రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. దాదాపు 82 రైల్వే సర్వీసులు ప్రారంభించారు. ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా రోజు వారి ఉద్యోగులకు, రోజు వారీగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, రైతులకు, రోజు వారి కూలీలకు తమ పనులు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా లాభాల కంటే ప్రయాణికుల ప్రయోజనమే ముఖ్యమని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్యా సింజర్లనూ ఎక్స్‌ప్రెస్‌ మాదిరిగా వేగంగా నడుపునున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దశల వారీగా మి గిలిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించేందుకు గల అవకాశాలను దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం
ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం
ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement