సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:28:26

సమస్యలను పరిష్కరిస్తున్నాం

సమస్యలను పరిష్కరిస్తున్నాం

 ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

 సీసీ రోడ్డు  పనులు ప్రారంభం 

ముషీరాబాద్‌ : బస్తీల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్డు నిర్మాణ పనులు  చేపడుతున్నట్లు  ముషీరాబాద్‌ ఎమ్మె ల్యే ముఠా గోపాల్‌ తెలిపారు. గురువారం  మోహన్‌నగర్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్‌ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హరినగర్‌లో ఇటీవల డ్రైనేజీ సమస్యను పరిష్కరించామని, త్వరలో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ శ్రీనివాస్‌, ఏఈ తిరుపతి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్‌, ఎయిర్‌టెల్‌ రాజు, వరుణ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల జీవితాల్లో వెలుగులు

చిక్కడపల్లి : రాష్ట్రంలో కుల వృత్తులను అభివృద్ధి చేసి వాటిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా చిక్కడపల్లిలో స్వర్ణ కారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ స్వర్ణకారులను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కందూరి కృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ గౌడ్‌, మోజస్‌, దామోదర్‌ రెడ్డి, నాగభూషణం, కిషన్‌ రావు, ఆర్‌ వివేక్‌, సంతోష్‌ గౌడ్‌, శంకర్‌ ముదిరాజ్‌, ముచ్చకుర్తి ప్రభాకర్‌, వికాస్‌ జైన్‌, అనిల్‌, సన్మాన గ్రహీతలు సంతోష్‌ చారి, శంకర్‌, భాస్కర్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

 చిక్కడపల్లి : నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అ న్నారు. గురువారం బాగ్‌లింగంపల్లి తదితర ప్రాం తాల్లో ఆయన పర్యటించారు. సీనియర్‌ నాయకుడు కిషన్‌ రావు, దామోదర్‌ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌ గౌడ్‌, నాగభూషణం, వివేక్‌, మోజెస్‌, నవీన్‌, నవీన్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.logo