శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 02, 2020 , 23:40:38

‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

కేపీహెచ్‌బీ కాలనీ : జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తెలంగాణ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు వినతిపత్రాన్ని అందించారు. జీహెచ్‌ఎంసీలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ. 25 వేలు వేతనం అందించాలని, కరోనా పాజిటివ్‌ వచ్చిన కార్మికుడికి రూ.50 వేలు తక్షణ సహాయం, కార్పొరేట్‌ వైద్యశాలలో చికిత్స, చనిపోయిన వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అన్నారు. ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సాయికుమార్‌, సీనియర్‌ నాయకులు వెంకటేశ్‌, యాకస్వామి, కృష్ణ, నర్సింహ, లక్ష్మీపవన్‌ ఉన్నారు.