e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ క్లిక్‌ చేస్తే కొవిడ్‌ సమాచారం

క్లిక్‌ చేస్తే కొవిడ్‌ సమాచారం

క్లిక్‌ చేస్తే కొవిడ్‌ సమాచారం

కొవిడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సైబరాబాద్‌ పోలీసు, సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఓ వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. శుక్రవారం covid.scsc.in పోర్టల్‌ను ప్రారంభించారు.. ఒక్క క్లిక్‌తో కొవిడ్‌తో లింక్‌ ఉండే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా క్రిటికల్‌ కేర్‌ సర్వీసెస్‌(ఎమర్జెన్సీ సేవలు), అంబులెన్స్‌ సేవలు, అక్సిజన్‌ సరఫరాదారులు, దవాఖానలు, బెడ్స్‌, ప్లాస్మా సపోర్టు, అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అలాగే అసొలేషన్‌ కేంద్రాలు, హోం క్వారంటైన్‌ సపోర్టు, డాక్టర్స్‌ ఆన్‌ కాల్‌, డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు, ఫార్మాసీలు, ఫూడ్‌ సర్వీసెస్‌, సైకాలిజిస్టులు, కౌన్సెలర్స్‌, పీపీఈ కిట్ల సరఫరా, శానిటైజేషన్‌ సపోర్టు, కొవిడ్‌ బులెటిన్స్‌, కీ కాంటాక్ట్స్‌ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. ఈ పోర్టల్‌ను రూపొందించిన ఎస్‌సీఎస్‌సీ ఉమెన్‌ ఫోరమ్‌ సంయుక్త కార్యదర్శి, కాగ్నిజెంట్‌ ప్రతినిధి ప్రత్యూష, వారి టీమ్‌ సభ్యులు అమిత్‌ ములే, యజ్ఞ ప్రియ, శివ, బద్రీనాథ్‌, అబ్దుల్‌ సయ్యద్‌, కృష్ణవేణి, సుస్మిత, శరత్‌, సాజిద్‌ అహ్మాద్‌తో పాటు ఈ పోర్టల్‌ను డిజైన్‌ చేసిన పల్లవ్‌ బాజ్జురీ, దీప్‌లను సీపీ సజ్జనార్‌, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ ఏదుల అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్లిక్‌ చేస్తే కొవిడ్‌ సమాచారం

ట్రెండింగ్‌

Advertisement