e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ ఆపన్నులకు చేయూతనివ్వండి

ఆపన్నులకు చేయూతనివ్వండి

ఆపన్నులకు చేయూతనివ్వండి
  • స్వచ్ఛంద సంస్థలు, సేవా కార్యకర్తలు ముందుకు రండి
  • కరోనా వేళ బాధితులను ఆదుకుందాం
  • ఆపదలో ఉన్నవారికి భరోసానిద్దాం
  • సైబరాబాద్‌ కంట్రోల్‌ సేవలను విస్తృత పరిచేందుకు భాగస్వాములు కండి
  • పిలుపునిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు

నగరంలో ఇప్పుడు ఎటు చూసినా కరోనా వైద్య సేవల కోసమే అన్వేషణ. ఒకరికి ఆక్సిజన్‌ కావాలి. ఇంకొకరికి రెమ్‌డెసివిర్‌ కావాలి. మరొకరికి వెంటిలేటర్‌, ప్లాస్మా అవసరం. ఇలా ఆపదలో ఉన్న వారు తమ స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఆ అవసరాల కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ వంతు ప్రయత్నంగా సేవలను ప్రారంభించిన సైబరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ప్రతిరోజూ 300కు పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, రక్తం, ప్లాస్మా కోసం దీనంగా వేడుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీరందరికీ కంట్రోల్‌ రూం ఆ అవసరాలను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నది. అయితే విజ్ఞాప్తులు వెల్లువలా ముంచెత్తుతున్న ఆపన్నులను ఆదుకునేందుకు మరింత మంది కార్యకర్తలు, సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సైబరాబాద్‌ పోలీసులు పిలుపునిస్తున్నారు.

24 గంటలు..100 మంది

కరోనా బాధితుల అవసరాలు తీర్చేందుకు కంట్రోల్‌ రూం నుంచి పనిచేస్తున్న వారి సంఖ్య వందమందికి చేరింది. వీరు షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తున్నారు. సాయం చేయగలిగిన స్వచ్ఛంద సంస్థలను ఇప్పటికే ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు ఇప్పించగలుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఎక్కడెక్కడ బెడ్స్‌ ఉన్నాయో ఆ వివరాలను తెలియజేస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా కలిసి covid.scsc.inను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక క్లిక్‌తో వారికి హైదరాబాద్‌ నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సేవల సమాచారం అత్యంత సులభంగా లభించేలా చేశారు. అర్ధరాత్రి ఫోన్‌ వచ్చినా అంబులెన్సులు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.

దాతలు ముందుకు రావాలి

  • అక్సిజన్‌ సిలిండర్‌లు, వెంటిలేటర్స్‌, ప్లాస్మా, బెడ్స్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ల అవసరం చాలా ఉంది.
  • అందుబాటులో ఉన్న వాటిని అత్యవసరమైన వారికి అందిస్తున్నాం.
  • అక్సిజన్‌ ప్లాంట్‌లు ఉన్నాయి కానీ సిలిండర్‌ల కొరత ఉంది.
  • వాటిని తయారు చేసే కంపెనీలు గుజరాత్‌లో ఉండటంతో సిలిండర్‌ల సరఫరాలో కొరత ఏర్పడుతున్నది.
  • దీనికి తోడు రెండో దశలో ప్లాస్మా దానానికి చాలా అనుమానాలతో వెనుకంజ వేస్తున్నారు.
  • అనుమానాలు, అపోహలు, సందేహాలను తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కృషి చేస్తున్నాం.
  • ప్రతి రోజు మాకు 300 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి.
  • అలా వచ్చిన వాటిలో 210 నుంచి 220 మందికి తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
  • ప్రతి ఒక్కరిలో సేవా దృక్పథం ఉన్పప్పటికీ వారికి సరైన దారి లభించక సందిగ్ధంలో ఉండిపోతున్నారు.
  • అలాంటి వారు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌-9490617440ను సంప్రదించి సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు.
  • ఇప్పటికే సైబరాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి దాదాపు 14 అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. – హనుమంతరావు, ఏసీపీ సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆపన్నులకు చేయూతనివ్వండి

ట్రెండింగ్‌

Advertisement