e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ మెట్రోలో స్మార్ట్‌ టికెటింగ్‌

మెట్రోలో స్మార్ట్‌ టికెటింగ్‌

మెట్రోలో స్మార్ట్‌ టికెటింగ్‌
 • మొబైల్‌ యాప్స్‌తో క్యూఆర్‌కోడ్‌ టికెట్‌
 • కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్‌కు అధిక ప్రాధాన్యం
 • కరోనా తీవ్రత నేపథ్యంలో నిర్ణయం

కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు బయటకెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రోరైలులో కరోనా నియంత్రణకు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. మెట్రోరైలు, స్టేషన్లతోపాటు కౌంటర్ల వద్దకెళ్లి టికెట్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మెట్రో స్మార్ట్‌ టికెటింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో ఈజీగా ప్రయాణించేందుకు అవసరమైన టికెట్‌ ఏర్పాట్లు చేశారు. ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నది మెట్రో రైళ్లల్లోనే. ప్రస్తుతం మూడు కారిడార్లలో అందుబాటులోకి రాగా, మొత్తం 69 కి.మీ మేర మెట్రోరైళ్లు ప్రతినిత్యం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో 4 మొబైల్‌ యాప్‌లు…

 • కౌంటర్‌లో డబ్బులు చెల్లించకుండా స్మార్ట్‌కార్డ్‌తోపాటు క్యూఆర్‌ కోడ్‌ ఉండే సరిపోతోంది.
 • టికెట్‌ కోసం క్యూలైన్లలో నిలబడకుండా టికెట్‌ తీసుకొని దర్జాగా ప్రయాణించొచ్చు.
 • కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్‌ విధానంలో భాగంగా 4 మొబైల్‌ యాప్‌ల ద్వారా టికెట్లను పొందవచ్చు.
 • ఇందులో టీఎస్‌ సవారీ, ఫోన్‌పే, పేటీఎం, మేక్‌ మై ట్రిప్‌ ఇలా నాలుగు మొబైల్‌ యాప్‌ల్లో దేని నుంచైనా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు స్మార్ట్‌ఫోన్‌లోనే టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 • ప్రస్తుతం మూడు కారిడార్‌ల పరిధిలో ఒక మెట్రోస్టేషన్‌ నుంచి మరో మెట్రోస్టేషన్‌ వరకు టికెట్‌ను మొబైల్‌లోనూ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
 • దీంతో కౌంటర్‌ వద్ద వేచి ఉండాల్సిన అవసరమే లేదు.
 • ఇందులో టీ సవారీ యాప్‌ ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నదైనా, మిగతావి మాత్రం ప్రైవేటు సంస్థలవి కావడంతో వాటి నిర్వహణ మెరుగ్గానే ఉన్నదని మెట్రో అధికారులు వివరించారు.

ఫోన్‌పే యాప్‌లో ఇలా…

 • మెట్రోరైలు టికెట్‌ కావాలంటే స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
 • ఇందులో రీచార్జీ, యుటిలిటీస్‌, డొనేషన్స్‌ కేటగిరీలతోపాటు మెట్రో రీచార్జ్‌ అండ్‌ క్యూఆర్‌ టికెట్స్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది.
 • ఇందులో హైదరాబాద్‌ మెట్రోరైలుతోపాటు ఢిల్లీ, ముంబయి, బెంగళూరులలోని మెట్రోరైళ్లలో ప్రయాణం చేసేందుకు టికెట్లను పొందవచ్చు.
 • అయితే హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే అందులో లోగోపై నొక్కగానే ప్రత్యేకంగా విండో వస్తుంది.
 • అందులో ప్రయాణికులు ఎంతమంది అని అడుగుతుంది.
 • దానికింద స్టారింగ్‌ ఫ్రమ్‌..ఆ తర్వాత దానికింద గోయింగ్‌ టూ అని అడుగుతుంది.
 • ఇలా మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లాలో ఆయా మెట్రోస్టేషన్‌ల పేర్లు నమోదు చేసిన వెంటనే టికెట్‌ ధర వచ్చేస్తుంది.
 • ఇందులో ఒకేసారి ఎంతమందికైనా టికెట్‌ తీసుకోవచ్చు.
 • ఒకవైపు ప్రయాణం లేదంటే తిరుగు ప్రయాణం కోసం ఫోన్‌పేలోనూ టికెట్‌ను క్యూర్‌ కోడ్‌ రూపంలో పొందవచ్చు.
 • బుకింగ్‌ చేసుకున్న టికెట్‌ను ఇతరులకు షేర్‌ చేసే అవకాశం ఉంది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెట్రోలో స్మార్ట్‌ టికెటింగ్‌

ట్రెండింగ్‌

Advertisement