బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Jul 17, 2020 , 00:33:20

సాదాసీదాగా బోనాలు

సాదాసీదాగా బోనాలు

మణికొండ:   నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో నిరాడంబరంగా బోనాలు నిర్వహించారు.  గోల్కొండ, లష్కర్‌ బో నాల తర్వాత మొదటివారంలో  ఉత్సవాలను చేయడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. గురువారం నార్సింగి, వట్టినాగులపల్లి, ఖానాపూర్‌లో   భౌతిక దూరం పాటిస్తూ  బోనాలు సమర్పించారు. నిబంధనలు పాటిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.  భక్తులకు ఎలాంటి అసౌకర్యా లు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.   గ్రామ దేవతలు పోచమ్మ, ఎల్లమ్మ, అమ్మోరు ఆలయాల్లో  అమ్మవారికి  నైవేధ్యం సమర్పించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత  ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో  వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌, కౌన్సిలర్లు గున్నాల అమరేందర్‌రెడ్డి, కిరణ్‌, పత్తి ప్రవీణ్‌, యాదమ్మ, ఉషారాణి, నాయకులు లక్ష్మీనారాయణ, వే ణుగౌడ్‌, వెంకటేశ్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట: బాలాపూర్‌, మల్లాపూర్‌లో బోనాలను సాదాసీదాగా నిర్వహించారు.  నిబంధనలు పాటిస్తూ  ఇం ట్లోనే మొక్కులు చెల్లించుకున్నారు. మా స్కు ధరించి కార్పొరేటర్‌ ఎర్రమహేశ్వరి అమ్మవారికి బోనం సమర్పించా రు. గతంలో ఊరంతా సందడిగా ఉం డేదని బడంగ్‌పేట మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి తెలిపారు. 

శంషాబాద్‌:  మండలంలోని  పెద్దతూప్రలో నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి బోనాలు  సమర్పిం చారు. ఎంపీపీ దిద్యాల జయమ్మ, శ్రీనివాస్‌ దంపతులు  దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కరో నా నుంచి ప్రజలను కాపాడాలని  అమ్మవారికి  నైవేద్యం సమర్పించా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

బడంగ్‌పేట: బోనాలను ఇంట్లోనే నిర్వహించుకోవాలని వనస్థలిపురం ఏసీపీ జయరాం సూచించారు. గురువారం మీర్‌పేటలోని ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హె చ్చరించారు. ఆలయ కమిటీ చైర్మన్లు ప్రజలకు అవగాహన కల్పిం చా లన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, సీఐ నర్సింగ్‌ యాదయ్య, ఎస్‌ఐ అనంత రాములు, నాయకుడు దీప్‌లాల్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.