మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 05, 2020 , 00:10:25

టాలెంట్‌ చూపించు..

టాలెంట్‌ చూపించు..

 ప్రతిభావంతుల కోసం.. ‘టాలెంటర్జ్‌'

ఆన్‌లైన్‌ వేదికపై దేశంలోనే అతి పెద్ద ప్రతిభా పాటవ పోటీలు

రెండున్నరేండ్ల నుంచి పద్దెనిమిదేండ్ల లోపు వారికి అవకాశం 

విజేతలకు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే చాన్స్‌ 

లలిత కళలు, చిత్రలేఖనం, గానం, నృత్యం మొదలైన పోటీలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వివిధ రంగాలలో రెండున్నరేండ్ల నుంచి పద్దెనిమిదేండ్ల లోపు పిల్లల ప్రతిభా పాటవాలను చాటేందుకు ఆన్‌లైన్‌ వేదికపై దేశంలోనే అతి పెద్ద టాలెంట్‌ హంట్‌ను నిర్వహించేందుకు ‘టాలెంటర్జ్‌' (స్టేజ్‌ యువర్‌ టాలెంట్‌) సంస్థ సిద్ధమైంది. దేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఇందులో పాల్గొనవచ్చు. ఆన్‌లైన్‌ సదుపాయం కలిగి, వారిలో ప్రతిభ ఉంటే చాలు.  గ్రామీణ, చిన్న పట్టణాలలో నివసిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఎలాంటి వేదిక అందుబాటులో లేని ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రపంచానికి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి, ప్రశంసలు అందుకోవడానికి ‘టాలెంటర్జ్‌' ఒక అద్భుతమైన వేదిక. ఒక స్టార్‌గా రాణించేందుకు, ఆ స్థాయిని చేరుకోవడానికి అవసరమైన ప్రేరణను ఈ వేదిక అందించనున్నది. 

రెండున్నరేండ్ల నుంచి 18 ఏండ్లలోపు వారికి..

ఎడ్యుకేషన్‌, బ్రాండింగ్‌, ఆర్ట్స్‌ వంటి విభిన్న రంగాలకు చెందిన ముగ్గురు ప్రతిభావంతుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘టాలెంటర్జ్‌'. ప్రారంభపు పోటీలు, కళలు, చిత్రలేఖనం, గానం, నృత్యంలతో మొదలుకానున్నాయి. లలిత కళలన్నింటిలో పోటీలు జరగనున్నాయి. ఇందులో రెండున్నరేండ్ల నుంచి 18 ఏండ్ల లోపు వారిని వయస్సుల వారీగా గ్రూపులను విభజించారు. 

రెండు నిమిషాల వీడియో..

ప్రతి పోటీదారు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో, లేదా చిత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఆసక్తి గలవారు www.talenterz.com కు లాగిన్‌ అయి ఈనెల 20తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవచ్చు. మొదటి ఫలితాలను ఆగస్టు 1న విడుదల చేస్తారు.  

 ఏ నుంచి డీ వరకు వయస్సుల గ్రూపులు 

ఏ - 2.5 సంవత్సరాల నుంచి ఐదేండ్ల వరకు..

బీ - ఆరేండ్ల నుంచి పదేండ్లు  

సీ - 11 సంవత్సరాల నుంచి 13 ఏండ్ల వరకు 

డీ - 14 సంవత్సరాల నుంచి 18 ఏండ్ల వరకు...

మన వారి ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు..

వర్ధమాన ప్రతిభావంతులలో ఉన్న టాలెంట్‌ను వెలుగులో తెచ్చి..ప్రపంచానికి వారిని, వారి కళలను పరిచయం చేసేందుకు ఈ వేదిక ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఏడాది పొడవునా 22 కళలపై జరిగే పోటీల ద్వారా ఇందులో పాల్గొనే వారి ప్రతిభను అంచనా వేస్తాం. విజేతలైన వారు అంతర్జాతీయ వేదికలపై తమ టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశాలున్నాయి. దేశంలో మొదటి సీజన్‌ ముగిసిన అనంతరం, యూరప్‌, ఆఫ్రికాలోని దేశాలలోని ప్రతిభను వెలికి తీసేందుకు మా పరిధిని విస్తరిస్తాం. ప్రతి ఖండం నుంచి గెలుపొందిన మొదటి మంది 12 విజేతలకు  ప్రపంచ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పిస్తాం. 

                                              - రమ్య  గంగాధరన్‌,  టాలెంటర్జ్‌ వ్యవస్థాపకురాలు


logo