మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:44:46

కరుణ చూపి.. ప్రేమ పంచి

కరుణ చూపి.. ప్రేమ పంచి

కరోనా కాలంలోనూ కరుణ

దత్తతకు ముందుకు వస్తున్న ఔత్సాహికులు

ఆర్నెళ్లలో రూ.10 లక్షలు అందించిన దాతలు

చార్మినార్‌, సెప్టెంబర్‌ 20: కరోనా కష్టకాలంలోనూ వన్యప్రాణుల సంరక్షణపై జంతు ప్రేమికులకు ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. మూగజీవాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తూ జంతు ప్రదర్శనశాలను సందర్శించి చేయూతనందిస్తున్నారు. వన్యప్రాణులను ఇష్టపడే వారు ‘జూ’లోని జంతువులను నిర్ధిష్ట కాలంపాటు దత్తత తీసుకోవచ్చు. సింహం, చిరుత, చింపాంజీ, పెద్దపులి, ఖడ్గ మృగం, ఏనుగు, అడవి దున్న, జిరాఫీ, ఎలుగుబంటి, మొసళ్లు, కోతులు, జీబ్రా, జింకలు, మూషిక జింకలు, తాబేళ్లు, సరీసృపాలు, రంగురంగుల పక్షులను  ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి జూ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. 

ప్రముఖుల ఆసక్తి

జూలోని జంతువులను దత్తత తీసుకోవడానికి ప్రముఖులు ఆసక్తి కనబరుస్తున్నారు. నెహ్రూ జూపార్క్‌లో 176 రకాలకు చెందిన జంతు జాతులు, 80కిపైగా పక్షి జాతులతో మొత్తం 1700కు పైగా ఉన్నాయి. హీరో రాంచరణ్‌ భార్య ఉపాసన, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నారాయణ స్వామి, పుణెకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి, పలు పాఠశాలల యజమాన్యాలు జూలోని పలు జంతువులు, పక్షులను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. కొన్నేండ్లుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు జూలోని 15 పెద్ద పులులను వరుసగా దత్తత తీసుకుంటున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నారాయణ స్వామి ప్రతియేటా రూ.10 లక్షలకు పైగా చెల్లించి వన్యప్రాణులకు అండగా నిలుస్తున్నారు. జంతువులను దత్తత తీసుకునే వారి వివరాలను  ప్రత్యేకంగా ఆయా జంతువులు ఎన్‌క్లోజర్‌ వద్ద సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్నారు అధికారులు.

ఆదాయపు పన్ను మినహాయింపు

దత్తత కోసం చెల్లించే డబ్బుపై ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర ప్రయోజనాలు సమకూరుస్తున్నామని క్యూరేటర్‌ క్షితిజ తెలిపారు. దత్తత తీసుకున్నవారి కుటుంబ సభ్యులు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా జూను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వన్యప్రాణులను దత్తత తీసుకోవడం వల్ల జూకు రూ.10లక్షల 65వేల ఆదాయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాము ఇష్టపడిన జంతువుల ఆహార ఖర్చును భరిస్తూ దత్తత తీసుకోవచ్చని క్యూరేటర్‌ తెలిపారు. ఏనుగుకు సంవత్సరానికి రూ.5 లక్షలు, సింహానికి లక్ష చెల్లించాల్సి ఉంటుంది.

వన్యప్రాణుల దత్తత వివరాలు (ఏడాది కాలపరిమితి)  

జంతువు వ్యయం

ఏనుగు, జిరాఫీ 5 లక్షలు

టైగర్‌, లయన్‌, రైనో, హిప్పో 1లక్ష

పాంతర్‌, జాగ్వార్‌, చీతా, ఎలుగు, చింపాంజీ 75 వేలు 

అడవి దున్న, ఆస్ట్రిచ్‌, ఇతర పక్షులు 50 వేలు 

హైనా, ఊల్ఫ్‌, వైల్డ్‌డాగ్‌, జాక్విల్‌, స్మాల్‌ క్యాట్‌ 40 వేలు

రేహా, ఈము 40 వేలు 

బబుల్‌, లాంగూర్‌, లయన్‌ టేల్డ్‌ మంకీ 30 వేలు

మాకౌ, మీడియం సైజ్‌ బర్డ్స్‌, వాటర్‌ బర్డ్స్‌,

కింగ్‌ కోబ్రా, పైతాన్‌, జీబ్రా, జాయింట్‌ టార్టాయిస్‌ 30 వేలు 

మొసలి, వాటర్‌ మోనిటర్‌ లిజార్డ్‌, కామన్‌ కోబ్రా, 

ర్యాట్‌ స్నేక్‌, ల్యాండ్‌ మోనిటర్‌ లిజార్డ్‌, స్మాల్‌ బర్డ్స్‌ 20 వేలుlogo