నాలాలపై దుకాణాలు ఖాళీ చేయాలి

ఉస్మాన్‌గంజ్ వంతెన పనులను
పర్యవేక్షించిన మంత్రి తలసాని
సుల్తాన్‌బజార్ : నాలాలపై దుకాణాలు ఖాళీ చేయాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శనివారం ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలోని పాత బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న తోప్‌ఖానా నాలాపై వంతెన పనులను ఆయన కార్పొరేటర్లు మమతాసంతోష్‌గుప్తా, పరమేశ్వరీసింగ్, శంకర్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌వ్యాస్, ఆర్వీ మహేందర్, డీఎంసీ వినయ్‌కపూర్, విద్యుత్‌శాఖ, జలమండలి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నాలా వంతెన పనులు త్వరగా పూర్తయ్యేలా వ్యాపారులు సహకరించాలన్నారు.
అక్రమ నిర్మాణాలుంటే కూల్చేస్తాం
నాలాపై అక్రమ నిర్మాణాలుంటే కూల్చేస్తామని మంత్రి హెచ్చరించారు. కొన్నేండ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో అత్యాధునిక పద్ధతులతో రూ. 2.25 కోట్ల నిధులతో జరుగుతున్నాయన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఉస్మానియా దవాఖానలో వరదనీరు చేరిందని మళ్లీ నీరు నిలువకుండా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు నూతన టెక్నాలజీ సాయంతో వేగవంతంగా పూర్తయ్యే విధంగా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి, ఆళ్లబండ జలమండలి సెక్షన్ మేనేజర్ రమేశ్, అధికారులు, నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..