e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ

వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ

వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ
  • షీటీమ్స్‌కు విదేశాల నుంచి ఫిర్యాదులు
  • చాకచక్యంగా దర్యాప్తు, కేసులు పరిష్కారం
  • వస్తున్న కేసుల్లో వేధింపులే అధికం
  • మనోళ్లకు అండగా ఉంటున్న షీటీమ్స్‌ పోలీసులు
  • బాధితుల నుంచి ప్రశంసలు

సిటీబ్యూరో, జూన్‌ 14 (నమస్తే తెలంగాణ): నగరంలో ఉంటున్న మహిళలకే కాదు..విదేశాల్లో ఉంటున్న మన ఆడపడుచులకు భరోసా ఇస్తున్నారు షీటీమ్స్‌ పోలీసులు. విదేశాల్లో ఉంటూ ఎవరికి చెప్పుకోవాలో..ఎలా చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారు నగరంలోని షీటీమ్స్‌లకు ఫిర్యాదు చేయగా, సమస్యలను పరిష్కరిస్తూ అండగా ఉంటున్నాయి. వచ్చే ఫిర్యాదులను చాకచక్యంగా పరిష్కరిస్తున్నాయి. హైదరాబాద్‌ షీ టీమ్స్‌ అదనపు డీసీపీ శిరీష నేతృత్వంలోని బృందాలు కేసుల పెండిన్సీ లేకుండా ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో వాటి తీవ్రతను బట్టి వెంటవెంటనే పరిష్కరిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో కూడా ఈ బృందాలు నిరంతరం పనిచేస్తూ మహిళకు బాసటగా నిలుస్తున్నాయి.

కొన్ని విదేశీ ఫిర్యాదులు ఇలా

  • హైదరాబాద్‌లో ఉంటూ భార్యాభర్తలిద్దరూ ఐటీ ఉద్యోగం చేసి అమెరికాకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఇద్దరు కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. భార్య గర్భం దాల్చడంతో ఉద్యోగం మానేసింది. కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమై తారాస్థాయికి చేరాయి. మనస్పర్థలతో విడిపోయే పరిస్థితికి చేరింది. భర్తతో ఇబ్బందులు పడుతూ ఒకరోజు ఆమె షీ టీమ్స్‌ హైదరాబాద్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించిన షీటీమ్స్‌ వెంటనే వాట్సాప్‌ కాల్‌లో బాధితురాలితో మాట్లాడారు. నగరంలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులు షీ టీమ్స్‌కు వచ్చి విషయాన్ని వివరించారు. ఆ తర్వాత భర్త కుటుంబసభ్యులను కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వేధింపులు మానుకోకుంటే ఎల్‌వోసీ జారీ చేస్తామని, భారత్‌లోకి రాగానే అరెస్టవుతాడని సూచించారు. షీ టీమ్స్‌ కౌన్సెలింగ్‌తో సదరు భర్తలో మార్పు వచ్చింది. ఆమె షీ టీమ్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
  • హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు ఇంగ్లాండ్‌కెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉండడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్త హైదరాబాద్‌కు వచ్చాడు. భర్తకు హైదరాబాద్‌లో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఇంగ్లాండ్‌లో ఉన్న భార్య షీ టీమ్స్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించి వెంటనే హైదరాబాద్‌లో ఉన్న భర్తను పిలిపించి, ఇంగ్లాండ్‌లో జరిగిన విషయాలు, హైదరాబాద్‌లో జరుగుతున్న వాటి గురించి వివరించడంతో కంగుతిన్నాడు. లండన్‌లో ఉన్న తమ గురించి ఎలా తెలిసిందని చాలాసేపు కంగారుపడ్డాడు. బుద్ధి మార్చుకోమంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తప్పు తెలుసుకున్నానని, ఇక చేయనంటూ తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత భార్యతో సఖ్యతగా ఉండడంతో ఆమె కూడా సంతోషం వ్యక్తం చేస్తూ షీటీమ్స్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.
  • దుబాయ్‌లో ఉండే ఒక విద్యార్థినికి ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాస్‌లను ఆసరా చేసుకొని బోధించే వ్యక్తి సదరు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడం, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్‌ మూలాలున్న బాధితులకు తెలంగాణలో షీ టీమ్స్‌ గురించి అవగాహన ఉండడంతో, ఏదో విధంగా సహాయ పడమని హైదరాబాద్‌ షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. నిందితుడు కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించి, అక్కడి పోలీసులకు ఈ కేసును వివరించడంతో చర్యలు చేపట్టారు.

మేమున్నామనే భరోసా ఇస్తున్నాం

మహిళల భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్‌ తీసుకొచ్చింది. షీ టీమ్స్‌ను ఆశ్రయించే ఆపదలో ఉండే మహిళలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక్కడే కాదు..విదేశాల నుంచి వచ్చే ఫిర్యాదులపై మా బృందాలు స్పందిస్తున్నాయి. సమస్య పరిష్కరించాలనే ఆలోచన ఉంటే ఎలాగైన పరిష్కారమవుతుంది. భయపడకుండా షీ టీమ్స్‌ను ఆశ్రయించండి. మీ కోసం మేమున్నాము. -శిఖాగోయెల్‌, అదనపు డీజీ

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ
వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ
వేధింపులు అక్కడ పరిష్కారమిక్కడ

ట్రెండింగ్‌

Advertisement