e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ విమానాశ్రయం.. మరింత చేరువ

విమానాశ్రయం.. మరింత చేరువ

 • శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరువైన దారి
 • జూబ్లీహిల్స్‌, ఓఆర్‌ఆర్‌, మై హోం అవతార్‌ వరకు
 • సుమారు 7 కి.మీ దూరం 6 లేన్ల రోడ్డుగా..
 • జూబ్లీహిల్స్‌ రోడ్‌ 45 నుంచి ఓఆర్‌ఆర్‌కు లింకు
 • ల్యాంకోహిల్స్‌, మణికొండ, మై హోం అవతార్‌కు
 • భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలు తట్టుకునేలా..

సిటీబ్యూరో, సెప్టెంబరు 17(నమస్తే తెలంగాణ): మహా నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని లిం కు రోడ్లు, ఓల్డ్‌ ముంబై రహదారిని కలుపుతూ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త దారులు పడుతున్నాయి. దీంతో దూరాలు కాస్త దగ్గరవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని గ్రేటర్‌ నుంచి మెరుగైన రోడ్డు నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రోడ్లతోనే సరిపెట్టుకోకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో రోడ్డు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేలా అటు గ్రేటర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), ఇటు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లు పనిచేస్తున్నా యి.

ప్రధానంగా జన సాంద్రత ఎక్కువగా పెరగనున్న వెస్ట్‌ జోన్‌ నుంచి రోడ్డు మార్గాలను ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వాడుకలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని, అక్కడ నివాసం ఉం డే జనాభాను పరిగణనలోకి తీసుకొని మౌలిక వసతుల ను కల్పించేందుకు ప్రభుత్వ శాఖలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 నుంచి నేరుగా నార్సింగి-పుప్పాల్‌గూడ వద్దనున్న ఔటర్‌ రింగురోడ్డును కలిసేలా 6 లేన్లతో రోడ్డును నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

సుమారు 2కి.మీ. మేర భూ సేకరణ చేస్తే చాలు 7 కి.మీ డైరెక్ట్‌ లింకు రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనుకున్నట్లుగా ఈ లింకురోడ్డు పూర్తి స్థాయిలో జరిగితే జూబ్లీహిల్స్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు, అక్కడి నుంచి అం తర్జాతీయ విమానాశ్రయం వరకు దూరం 27 కి.మీ అవుతుందని, 20-30 నిమిషాల్లో పోర్టుకు చేరుకోవచ్చు.

ఎయిర్‌ ట్రాఫిక్‌ అంతా వెస్ట్‌జోన్‌ నుంచే…

విమానాశ్రయం చేరుకునేందుకు అత్యంత మెరుగైన, వేగవంతమైన రోడ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ శాఖలు నిమగ్న మై ఉన్నాయి. ప్రధానంగా నగరం నుంచి విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌లో సింహా భాగం వెస్ట్‌జోన్‌ పరిధి నుంచే అధికంగా ఉంటోంది.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నం: 45 నుంచి ఇలా..

కేబీఆర్‌ పార్కు నుంచి మాదాపూర్‌ దుర్గం చెరువు జూ బ్లీహిల్స్‌ రోడ్డు నం:45 నుంచి ఎడమ వైపునకు తిరిగితే రోడ్డు నం: 51, 70ల మీదుగా షేక్‌పేట-రాయదుర్గం మార్గంలో ఉన్న పాత ముంబై హైవే ను దాటి మల్కం చెరువు, మణికొండ చిత్రపురి కాలనీ, ల్యాంకోహిల్స్‌ మీదుగా మై హోం అవతార్‌, ఓఆర్‌ఆర్‌ అండర్‌ పాస్‌ జంక్షన్‌ వరకు సుమారు 7కి.మీ మేర లింకు రోడ్డును 6 లేన్లతో నిర్మించనున్నారు. పాత ముం బై హైవే నుంచి మణికొండలోని చిత్రపురి కాలనీ, ల్యాంకో హిల్స్‌లోని రోడ్లను కలుపుతూ మై హోం అవతావర్‌ వరకు నిర్మించే లింకు రోడ్డు మణికొండలో కీలకం కానుంది.

ఓఆర్‌ఆర్‌కు అనుసంధానమైన రోడ్లు

 • మాదాపూర్‌ హైటెక్‌ సిటీ నుంచి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ మీదుగా..
 • రాయదుర్గం, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వరకు..
 • పాత ముంబై హైవేలో రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి
 • నానక్‌ రాంగూడ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ వరకు..
 • మియాపూర్‌, కొండాపూర్‌ మీదుగా గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వరకు
 • శేరి లింగంపల్లి నుంచి గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌ మీదుగా కోకాపేట ఇంటర్‌ ఛేంజ్‌ వరకు..
 • శేరి లింగంపల్లి, నల్లగండ్ల, గోపన్‌పల్లి మీదుగా వట్టి నాగులపల్లి ఓఆర్‌ఆర్‌ వరకు..
 • జూబ్లీహిల్స్‌-షేక్‌పేట నాలా నుంచి మణికొండ, పుప్పాల్‌గూడ మీదుగా నార్సింగి వరకు…
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement