ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Dec 04, 2020 , 02:56:35

అంకితభావంతో సేవలందిస్తేనే గుర్తింపు

అంకితభావంతో సేవలందిస్తేనే గుర్తింపు

  • మంత్రి ఈటల రాజేందర్‌

వెంగళరావునగర్‌ : అంకిత భావంతో సేవలందించే ఉద్యోగులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. స్థానిక విద్యుత్‌శాఖలో ఏఈగా విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన దేవళ్ల సమ్మయ్యకు వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని ఏజీకాలనీలోని జెన్‌కో కార్యాలయంలో గురువారం తోటి ఉద్యోగుల అధ్యర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రాజేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పటి నుంచి రిటైర్డ్‌ అయ్యే వరకు మనం చేసే పనులు భవిష్యత్‌లో తోటి వారికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ మధుయాస్కీ గౌడ్‌, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌  మధు, నాయకులు శ్రీనివాస్‌, సతీష్‌, శివాజీ, కృష్ణ, రోషన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమయ్య, విజయ దంపతులను మంత్రి ఈటల ఘనంగా సన్మానించారు. logo