మంగళవారం 14 జూలై 2020
Hyderabad - Jun 30, 2020 , 00:37:20

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి ట్రేడర్స్‌ వస్త్ర వ్యాపారుల నిర్ణయం

కరోనా కట్టడిలో వ్యాపారుల సంపూర్ణ భాగస్వామ్యం 

 మలక్‌పేట: నగరంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు, వర్కర్లు, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి జూలై5 వరకు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి ట్రేడర్స్‌ వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు తెలిపారు. సోమవారం స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేసి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

లాక్‌డౌన్‌ బుగులు.. ‘గంజ్‌' కిటకిట

 నగరంలోని మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తల నేపథ్యంలో మలక్‌పేట గంజ్‌ కొనుగోలుదారులతో సందడిగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొస్తాయన్న ప్రచారంతో పాటు సరుకులకు కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందారు. ఇదే అదునుగా భావించి ప్రజలు ముందస్తు జాగ్రత్తగా నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ఎగబడ్డారు. 


logo