ఆత్మగౌరవ సౌధం

ఇంటి కల..నేరవేరుతున్న వేళ
పూర్తయిన 22,572 డబుల్ ఇండ్లు
డిసెంబర్ నాటికి మొత్తం 75వేలు...
టన్నెల్ ఫాం టెక్నాలజీతో వేగంగా పనులు
నిర్మాణంలో 10 వేల జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలు
ఏడాది చివరికల్లా పంపిణీకి ఏర్పాట్లు
ఆదర్శవంతమైన పేదల కాలనీగా కొల్లూరు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పేదల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గదుల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. 22 వేల పైచిలుకు ఇండ్లు ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉండగా, డిసెంబర్ చివరికల్లా మొత్తం 75వేల ఇండ్లను పూర్తి చేయాలని సంకల్పించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం రూ.9714.59 కోట్లతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల పరిధిలోని 107 ప్రాంతాల్లో వీటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సంగం చెరువు, చిత్తారమ్మ బస్తీ, కిడ్కీ బూద్అలీషా, సయిద్ సాబ్‌కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీలో 632 ఇండ్లు ఇప్పటికే ప్రారంభించగా.. మరో 22 కాలనీల్లో 22,572 ఇండ్లు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. మొత్తం 107 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తుండగా.. 56 చోట్ల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగతా 51 ప్రాంతాల్లో మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు సాగుతున్నాయి. 10 వేల జేఎన్ఎన్యూఈఆర్ఎం ఇండ్లతో కలిపి.. డిసెంబర్‌కల్లా 85 వేల ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కొల్లూరులోనే 15వేల పైచిలుకు ఇండ్లతో అతిపెద్ద కాలనీ నిర్మించారు. అటు రాంపల్లి, అహ్మద్‌గూడ, దుండిగల్, బాచుపల్లి, పోచంపల్లిలో కూడా పెద్ద కాలనీలు నిర్మాణమవుతున్నాయి. ఇటుకలు వాడకుండా గోడలన్నీ కాంక్రీట్‌తో నింపే ఆధునిక టన్నెల్ ఫామ్ టెక్నాలజీతో ఈ నిర్మాణాలు చేపట్టారు.
ఆదర్శవంతమైన కాలనీగా....
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1354.59 కోట్లతో ఎస్+9,ఎస్+ 10, ఎస్+11 అంతస్తుల్లో 15,660 ఇండ్లు నిర్మించారు. మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటిక, బస్ స్టేషన్, పోలీస్ ఔట్‌పోస్టు, పార్కులు, జిమ్, పెట్రోల్ స్టేషన్, విశాలమైన కమ్యూనిటీ హాల్, ఫైర్ స్టేషన్ లాంటి సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పిస్తున్నారు. 15,660 ఇండ్లకుగాను ఒక్కో ఇంటికి నలుగురు సభ్యుల చొప్పున చూసుకున్నా 62,640 మంది ఈ కాలనీలో నివసించే అవకాశం ఉంది. ఇంత విశాలమైన కాలనీ పూర్తి ఉచితంగా పేదల కోసం నిర్మించడం బహుషా దేశంలో ఇదే మొదటిదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
75 వేల ఇండ్లు సిద్ధం చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ కల్లా 75వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీకి సిద్ధం చేస్తాం. ఇప్పటికే చాలా చోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తయింది. కొన్నిచోట్ల రంగులు వేసే పనులు, మరికొన్నిచోట్ల రోడ్లు, తాగు నీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.ఆధునిక పద్ధతుల్లో అతి తక్కువ సమయంలోఇండ్లను నిర్మిస్తున్నాం.
-సురేశ్‌కుమార్, బల్దియా
గృహ నిర్మాణ విభాగం ఓఎస్డీ
పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్ల వివరాలు
క్ర.సం. లొకేషన్ జిల్లా నియోజకవర్గం ఇన్సీటూ/వెకెంట్ ఇండ్లు అంతస్తులు
1. సంగం చెరువు మేడ్చల్ ఉప్పల్ ఇన్సీటూ 176 జీ+3
2. చిత్తారమ్మబస్తీ మేడ్చల్ కూకట్పల్లి ఇన్సీటూ 108 సీ+ఎస్+9
3. కిడ్కీ బూద్ అలీషా హైదరాబాద్ మలక్‌పేట్ ఇన్సీటూ 12 జీ+3
4. సయిద్సాబ్ కా బాడా హైదరాబాద్ యాకుత్‌పుర ఇన్సీటూ 48 జీ+3
5. ఎరుకల నాంచారమ్మబస్తీ రంగారెడ్డి ఎల్బీనగర్ ఇన్సీటూ 288 సీ+ఎస్+9
6. గాజులరామారం మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 144 జీ+3
7. అమీన్పూర్-1 సంగారెడ్డి పటాన్చెరు వెకెంట్ 176 జి+3
8. జమ్మిగడ్డ మేడ్చల్ ఉప్పల్ వెకెంట్ 56 జీ+3
9. అహ్మద్‌గూడ మేడ్చల్ మేడ్చల్ వెకెంట్ 4428 సీ+ఎస్+9
10. డీ.పోచంపల్లి-1 మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 1404 సీ+ఎస్+9
11. డీ.పొచంపల్లి-2 మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 216 సీ+ఎస్+9
12. బహదూర్‌పల్లి మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 900 ఎస్+5
13. జియాగూడ హైదరాబాద్ కార్వాన్ ఇన్సీటూ 840 ఎస్+5
14. దుండిగల్ మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 3996 సీ+ఎస్+9
15. రాంపల్లి మేడ్చల్ మేడ్చల్ వెకెంట్ 6240 సీ+ఎస్+9
16. బాచుపల్లి మేడ్చల్ కుత్బుల్లాపూర్ వెకెంట్ 1080 సీ+ఎస్+9
17. శంకర్పల్లి-1 రంగారెడ్డి చేవెళ్ల వెకెంట్ 756 సీ+ఎస్+9
18. శంకర్పల్లి-2 రంగారెడ్డి చేవెళ్ల వెకెంట్ 756 సీ+ఎస్+9
19. కిష్టారెడ్డిపేట్ సంగారెడ్డి పటాన్చెరు వెకెంట్ 432 సీ+ఎస్+9
20. నార్సింగి రంగారెడ్డి రాజేంద్రనగర్ వెకెంట్ 216 సీ+ఎస్+9
21. బైరాగిగూడ-2 రంగారెడ్డి రాజేంద్రనగర్ వెకెంట్ 180 సీ+ఎస్+9
22. కట్టెలమండి హైదరాబాద్ గోషామహల్ ఇన్సీటూ 120 జీ+3
మొత్తం 22572
తాజావార్తలు
- మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వచ్చేశాయి..!
- ఢిల్లీలో స్వల్ప భూకంపం.. 2.8 తీవ్రత
- ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు
- పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు