మంగళవారం 26 మే 2020
Hyderabad - May 24, 2020 , 02:05:08

ఐటీ కారిడార్‌లో భద్రత ను పటిష్టం

ఐటీ కారిడార్‌లో భద్రత ను పటిష్టం

హైదరాబాద్ : ఐటీ కారిడార్‌లో భద్రత ను పటిష్టం చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఉద్యోగులకు సురక్షితమైన ప్రయాణం, వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయం వెనుకాల ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లోని ఆర్‌కేసీ(రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ) కార్యాలయాన్ని సీపీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌కేసీ సభ్యులను నియమించారు. 

 కన్వీనర్‌గా ఎల్బీనగర్‌ డీసీపీ సంప్రీత్‌ సింగ్‌, సంయుక్త కార్యదర్శిగా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌గా రమాదేవి , ఉమెన్స్‌ ఫోరమ్‌ కన్వీనర్‌గా మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి,  సంయుక్త కార్యదర్శిగా లతా సుబ్రహ్మణ్యం, సెక్యూరిటీ ఫోరమ్‌ కన్వీనర్‌గా యాదాద్రి-భువనగిరి డీసీపీ నారాయణరెడి,్డ సంయుక్త కార్యదర్శిగా సంపత్‌రావు పాటిల్‌, ట్రాఫిక్‌ ఫోరమ్‌ కన్వీనర్‌గా ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు, సంయుక్త కార్యదర్శిగా భాస్కర్‌ మొహర్‌, రూరల్‌ ఔట్‌ రీచ్‌ సంయుక్త కార్యదర్శిగా సుధాకర్‌, కోశాధికారిగా గగన్‌ దీప్‌ కోహ్లి , ఛీప్‌ కో-ఆర్డినేటర్‌గా సావిత్రిలు నియమితులయ్యారు. 

అయితే.. రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ గత డిసెంబర్‌ 23న ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..  రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ .. ఐటీ కారిడార్‌లో భద్రతకు సంబంధించిన అంశాలపై పోలీసులకు, ఉద్యోగులకు వారధిగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగినుల రక్షణ, వారి సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు అధికారులతో ప్రతినిధులు మాట్లాడి.. అందుకు కావాల్సిన చర్యలను చేపడతారన్నారు. ఈ కౌన్సిల్‌ ఏర్పాటుతో ఉద్యోగులకు ఎలాంటి అభద్ర తాభావం ఉండదని, క్షేమంగా ప్రయాణించవచ్చని తెలిపా రు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్‌ కమిషన ర్‌ సుధీర్‌బాబు, ఆర్‌కేసీ ప్రతినిధులు , పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


logo