సెక్యూరిటీ గార్డుల అరెస్టు

ఖైరతాబాద్ : పని చేసే సంస్థకే కన్నం వేశారు...ఆ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. డూప్లికేట్ తాళాలలో షోరూమ్‌ను తెరిచి నగదును అపహరించారు. కేసు దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్, సీఐ నిరంజన్ రెడ్డి, డీఐ కె. నాగయ్య, ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డి వివరించారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బసవకల్యాణ్ తాలూకా, తాపాక గ్రామానికి చెందిన బిరాదర్ బలిరామ్ అలియాస్ బలిరామ్ (32) కొంత కాలం క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం.11లోని గౌరీశంకర్ కాలనీలో అద్దె గదిలో ఉంటున్నాడు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తా కరేబేరియా ప్రాంతానికి చెందిన మహ్మద్ అజీముద్దీన్ లంగర్ హౌజ్‌లోని లక్ష్మీనగర్‌లో డే అండ్ నైట్ సెక్యూరిటీ సర్వీస్‌లో నివాసముంటున్నాడు. వీరిద్దరు బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని జేడ్ బ్లూ షోరూమ్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. షాపులో డబ్బులు తస్కరించాలన్న ఉద్దేశంతో గత నెల 22న ముందుగానే తయారు చేసుకున్న షోరూమ్ డూప్లికేట్ తాళాలతో షట్టర్‌ను తెరిచారు. సీసీ ఫుటేజీలలో పడకుండా డీవీఆర్ సిస్టమ్ ఫ్లగ్లను తొలగించారు. అనంతరం క్యాష్ కౌంటర్ తెరిచి అందులోని రూ.4.60లక్షలు దొంగలించారు. ఈ మేరకు షోరూమ్ నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.60లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!