మంగళవారం 14 జూలై 2020
Hyderabad - Jun 30, 2020 , 01:46:17

మీ ఇల్లు భద్రంగా..

మీ ఇల్లు భద్రంగా..

అందుబాటులో ‘డిస్‌ఇన్‌ఫెక్షన్‌' సేవలు

ఇండ్లు, ఫ్లాట్లు, కార్యాలయాల్లో ‘గో శానిటైజ్‌'.. నిబంధనల మేరకే రక్షణ చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శానిటైజ్‌ చేసుకోవడం.. మాస్కులు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. వస్తువులను డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. కానీ  ఇల్లు, ఇంటి పరిసరాలు, కార్యాలయాలు భద్రమేనా.. రకరకాల సేవల కోసం నిత్యం ఇంటి పరిసరాల్లోకి చాలా మంది వచ్చి వెళ్తుంటారు.. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లివస్తుంటారు.. మరి ఇంటిని డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయడం ఎలా!.. ఇందుకు గో శానిటైజ్‌ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలను శుభ్రం చేసే సేవలు అందిస్తున్నది

‘గో శానిటైజ్‌'

సేవలు..

నిత్యం ఇంటి పరిసరాల్లోకి పాలు, పేపర్‌ వాళ్లు, కూరగాయలు అమ్మేవాళ్లు మొదలుకొని ఇలా ఎంతో మంది వచ్చిపోతుంటారు. ఒకరోజు ఇల్లు గడవడానికి  ఎన్నో రకాలైన పొరుగు సేవలను వినియోగిస్తుంటాం. ఈ క్రమంలో ఏదో ఒక రకంగా వైరస్‌ ఇంటి పరసరాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఇంట్లోనూ వైరస్‌ లేకుండా చేయడానికి  ‘గో శానిటైజ్‌' - ‘మీ ఆత్మీయులను, మీరు ప్రేమించేవారిని రక్షించుకోండి’ అంటూ “www. gosanitize.in” పేరుతో ఒక వెబ్‌ బేస్డ్‌ సంస్థ  శానిటైజేషన్‌ సేవలను అందిస్తున్నది.

అందరికీ అందుబాటులో..

ఇల్లు, దుకాణాలు, కార్యాలయాల్లో వైరస్‌ను పారదోలేందుకు గో శానిటైజ్‌ ఆధ్వర్యంలో  ‘ప్రొఫెషనల్‌ - హోమ్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ సర్వీసెస్‌' అందుబాటులోకి వచ్చాయి.  ‘స్టీమ్‌ క్లీనింగ్‌',  ‘డిస్‌ఇన్‌ఫెక్టింగ్‌ ఫాగ్‌'ను వెదజల్లుతూ, స్ప్రే ట్రీట్‌మెంట్‌ ద్వారా వైరస్‌తో పాటు ఇతర సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది.    సింగిల్‌ బెడ్‌రూం (1000 - 1250 ఎస్‌ఎఫ్టీ) అయితే, రూ.599, డబుల్‌ బెడ్‌రూం (1250 - 1750 ఎస్‌ఎఫ్టీ) రూ. 999, ట్రిపుల్‌ బెడ్‌రూం (1750 - 2500 ఎస్‌ఎఫ్టీ)కు రూ.1199, ఇంకా చిన్న ఫ్లాట్‌కు రూ.399కే శానిటైజ్‌ సేవలు అందిస్తున్నది. నోవెల్‌ అల్ట్రా  లో వోల్టేజ్‌ స్ప్రే ట్రీట్‌మెంట్‌ను వినియోగిస్తూ, డబ్ల్యూహెచ్‌వో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నారు. 

రక్షణ చర్యలు ఇలా..

ఇండ్లు, అపార్టుమెంట్లు, కార్యాలయాల్లో వైరస్‌ లేకుండా శానిటైజ్‌ చేయాల్సిందే. ప్రతి ఫ్లాట్‌కు 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతున్నది.  కామన్‌ ఏరియాలు కూడా వైరస్‌ ధరిచేరకుండా  శానిటైజ్‌ చేయాలి. శానిటైజ్‌ చేసే సమయంలో 60 ఏండ్లు దాటిన వృద్ధులు, 12 ఏండ్లలోపు పిల్లలు,  అలర్జీ సమస్య ఉన్న వాళ్లు దూరంగా ఉండాలి.

జాగ్రత్తలు తప్పనిసరి..

సోఫాలు, ఫర్నిచర్‌ మొదలైన వాటిని శానిటైజ్‌ చేశాక వెంటనే వాడొచ్చు. దీంతో ఎలాంటి ప్రమాదం ఉండదు. శుద్ధి చర్యలు చేపడుతున్న సమయంలో తొందరగా మంటలు అంటుకునే నూనెలు, ఇతర పదార్థాలు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.


logo