సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:40:37

సెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌: ఎమ్మెల్యే

సెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌: ఎమ్మెల్యే

ఎర్రగడ్డ: సెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. ఆదివారం భారత్‌నగర్‌ బస్తీలో రూ.కోటి 12లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి రూ.65.35 లక్షలు, మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ, వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.45.30లక్షలు కేటాయించారు. ఆలయ అర్చకుడు, ఇమామ్‌, చర్చి పాదర్‌ అతిథులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బోరబండ డివిజన్‌లోని బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకున్న పార్టీలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. సర్వ మతాలకు కేంద్రమైన బోరబండలో అన్ని పండుగలను అందరూ కలిసి నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌, నాయకులు పాల్గొన్నారు. 
logo