బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హాలీవుడ్ నటుడు , టైటానిక్ ఫేం లియోనార్డో డికాప్రియోతో కలిసి దిగిన రేర్ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్లో దిగిందని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పిక్ తీసినట్టు తెలియజేసిన అనుపమ్.. లియోనార్డోపై ప్రశంసలు కురిపించారు.
నేను కొన్ని సంవత్సరాల క్రితం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లియోనార్డో డికాప్రియోను కలిశాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.” నేను భారతీయ నటుడిని “అని అన్నాను.” నాకు తెలుసు అని ఆయన అన్నారు. అప్పుడు ఎలా అని అడగగా, ఆయన ఒక హగ్ ఇచ్చారు . అతను మంచి నటుడే కాదు దయ, ఆప్యాయత వంటివి చాలా ఎక్కువ. నటుడి గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన వ్యక్తులని కలుసుకుంటారు. వారితో బంధం కూడా ఏర్పరుచుకోగలరు అని
అనుపమ్ ఖేర్ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.