ప్రభుత్వ భూములను కాపాడాలి

సర్కారు భూములను అమ్ముతున్న ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
సమీక్షలో నియోజకవర్గ అంశాలను ప్రస్తావించిన ప్రభుత్వ విప్ గాంధీ
హైదర్‌నగర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 57 ప్రభుత్వ భూమిలో స్థానిక ప్రైవేట్ వ్యక్తులు నోటరీ పత్రాలతో విక్రయాలు చేపడుతూ కోట్లు కొల్లగొడుతున్నారని తక్షణమే నిలువరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంహెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానందలతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. సర్వే నంబర్లు 57, 336 ప్రభుత్వ భూముల్లో ప్రజా అవసరాలకు కేటాయించినప్పటికీ పలువురు ఆక్రమణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు కాలనీల్లో లే అవుట్ అనుమతి వచ్చినా సాంకేతిక కారణాల వల్ల గృహ నిర్మాణాలకు అనుమతి ఇవ్వటం లేదని గాంధీ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్, బీకే ఎన్క్లేవ్ సహా మరో 12 కాలనీల్లో తక్షణమే గృహ నిర్మాణ అనుమతులివ్వాలని కోరారు. గోకుల్ ఫ్లాట్స్ క్రమబద్ధీకరణపై అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై తన విన్నపంతో చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు విప్ గాంధీ తెలిపారు.
తాజావార్తలు
- బండి సంజయ్ వికృత స్వభావానికి నిదర్శనం
- యూపీలో పాప మృతిపై బాలల హక్కుల సంఘం దర్యాప్తు
- ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు
- గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు
- ట్విట్టర్లో మహిళలు ఏం పోస్ట్ చేస్తున్నారంటే..?
- పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
- కోతులకు కల్లు ప్యాకెట్ దొరికితే ఊరుకుంటాయా.. ఓ పట్టుపట్టేశాయ్: వీడియో
- ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని