గురువారం 04 మార్చి 2021
Hyderabad - Jun 03, 2020 , 01:48:00

తెలంగాణ సస్యశ్యామలమే లక్ష్యం

తెలంగాణ సస్యశ్యామలమే లక్ష్యం

బషీర్‌బాగ్‌ : తెలంగాణ సస్యశ్యామలమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపా ల్‌,  మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని మహ్మదీయ ఫంక్షన్‌హాల్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

చిక్కడపల్లి : గాంధీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ము ఠా పద్మానరేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.  

ముషీరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మంగళవారం ముషీరాబాద్‌లో నిర్వహించా రు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్లు వీఎస్సార్‌, బి.హేమలతారెడ్ది, ఎడ్ల భాగ్యలక్ష్మి, జి.లాస్యనందిత, ముఠా పద్మ జాతీయ జెండాలను ఎగురవేశారు. 

 అంబర్‌పేట :  అంబర్‌పేటలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవిరమేశ్‌, పులి జగన్‌, కాలేరు పద్మ, ఎక్కాల చైతన్య పాల్గొన్నారు.

గోల్నాక : గోల్నాక డివిజన్‌ గంగానగర్‌లో కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబర్‌పేట పటేల్‌నగర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకుడు బీవీ రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించారు. బాపునగర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకుడు యాసిన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరించారు.  

చాదర్‌ఘాట్‌ : మలక్‌పేట మార్కెట్‌లో నిర్వహించి న రాష్ట్ర అవతరణ వేడుకులకు మలక్‌పేట నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఆజం అలీ విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ చీదళ్ల రాధ, వైస్‌ చైర్మన్‌ కొరుడు భూమేశ్‌, మార్కెట్‌ కస్‌జీఎస్‌ దామోద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 సైదాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మలక్‌పేట, యాకుత్‌పుర నియోజక వర్గాల్లోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ  జెండాలను ఆవిష్కరించి అవతరణ దినోత్సవాలను నిరాడంబరంగా ప్రారంభించారు.  సైదాబాద్‌ మెయిన్‌రోడ్‌, చేపల మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలను డివిజన్‌ కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి ఆవిష్కరించారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పగిళ్ల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 మాదన్నపేట : కుర్మగూడలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు సహదేవ్‌యాదవ్‌ హాజరయ్యారు.

  కాచిగూడ : తెలంగాణ అవతరణ దినోత్సవాలను టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు ఎక్కాల కన్నా ఆధ్వర్యం లో  డివిజన్‌లోని చప్పల్‌బజార్‌, లింగంపల్లి, బర్కత్‌పుర, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున  నిర్వహించారు. 

  కవాడిగూడ: టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎస్‌. యాదగిరి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్‌ లాస్యనందితతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

VIDEOS

logo