గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 05:42:52

సంతోష్‌ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం

సంతోష్‌ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం

హిమాయత్‌నగర్‌, : భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలోఅమరుడైన సంతోష్‌ బాబు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత్‌ సైనిక దినం సందర్భంగా సంతోష్‌ బాబు సేవలను స్మరిస్తూ ఆదివారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో సంతోష్‌బాబు సతీమణి, యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ సంతోషిని సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌ బాబు చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ అధ్యక్షుడు ఆకృతి సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంతోషి మాట్లాడుతూ కష్ట కాలంలో తమకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు డాక్టర్‌ వకులాభరణం కృష్ణమోహన్‌, మాజీ భారత సైన్యాధిపతి, లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ కె.రామచంద్రరావు, ప్రముఖ నాట్య గురువు డాక్టర్‌ ఎస్పీ భారతి, సంస్థ కార్యదర్శి ప్రసాద్‌, సంఖ్య శాస్త్ర మేధావి దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo