శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:44:09

పారిశుధ్య కార్మికులారా.. మీకు సలాం

పారిశుధ్య కార్మికులారా.. మీకు సలాం

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

హైదర్‌నగర్‌, ఆగస్టు 11 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా.. తమ విధులను నిర్వర్తిస్తూ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బంది సేవలు ఎనలేనివని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం హైదర్‌నగర్‌, వివేకానందనగర్‌ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికి ప్రభుత్వం తరపున పీపీఈ కిట్లను ఎమ్మెల్యే గాంధీ వేరు వేరు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతోనే కొవిడ్‌ బారిన పడకుండా ఉంటామన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. విధుల నిర్వహణే కాకుండా తమతో పాటు తమ కుటుంబాలను, వారి ఆరోగ్యాలను కాపాడుకునేందుకు కిట్లు దోహదపడతాయన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా మరింత పకడ్బందీగా పారిశుధ్య సేవలను కొనసాగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు నార్నె శ్రీనివాస్‌, సత్యనారాయణ, సంపత్‌, శ్రీకాంత్‌, నాయక్‌, సత్యనారాయణ, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo