టోల్‌ఫ్రీకి ఫోన్ చేస్తే రూ.5 లక్షలకు ఎసరు

హైదరాబాద్ : గూగూల్ పేలో సమస్య పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన ఓ మహిళ ఖాతాలోంచి సైబర్ నేరస్థులు రూ.5 లక్షలను కాజేశారు. బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన బ్యాంక్ ఖాతా నుంచి గూగుల్ పే చేసింది. దానికి సంబంధించిన సమచారం రాకపోవడంతో టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసింది. కానీ, ఆ కాల్ కనెక్ట్ కాలేదు.
కొద్దిసేపటి తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాననీ, మీ సమస్య పరిష్కారానికి కొన్ని లింక్‌లు పంపిస్తున్నాను.. అందులో వివరాలను నమోదు చేయాలని నమ్మించాడు. అనంతరం ఓటీపీని తెలుసుకుని బాధితురాలి ఖాతాపై రూ.5 లక్షల రుణం తీసుకుని వాటిని వివిధ ఖాతాలకు బదిలీ చేశాడు. బాధిత మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా నిందితులు జార్ఖండ్ లోని ధన్‌బాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ మండల్, మహ్మద్ కలాం ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో వీరు సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు గుర్తించారు.
తాజావార్తలు
- 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత