హైదరాబాద్: నగర శివార్లలోని యాప్రాల్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి యాప్రాల్ వైపు వెళ్తున్న కారులో రూ.20 లక్షల హవాల డబ్బు దొరికింది. దీంతో ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద లభించిన రెండు సెల్పోన్లు, వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.