గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Aug 20, 2020 , 23:33:42

వారంలో రూ.10 కోట్ల నిధులు విడుదల..

వారంలో రూ.10 కోట్ల నిధులు విడుదల..

టీపీటీ, సర్వీస్‌ చార్జీలు మరో రూ. 8కోట్లు 

ఆర్థిక శాఖ కార్యదర్శికి మంత్రి ఆదేశాలు

ఇటీవల రెండుసార్లు మంత్రిని కలిసిన బోర్డు సభ్యులు

బోర్డు పరిధిలో పట్టాలెక్కనున్నఅభివృద్ధి 

కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ బోర్డుకు వారంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 10కోట్ల నిధులు విడుదల చేసేందుకు మార్గం సుగుమమైంది.  బోర్డు పరిధిలో అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేయనున్న నిధులతో పనుల్లో వేగం పుంజుకోనుంది. ప్రభుత్వం నుం చి బోర్డుకు రావాల్సి ఉన్న ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ (టీపీటీ)తో పాటు సర్వీస్‌ చార్జీల బకాయిల్లో భాగంగా అదనంగా మరో రూ. 8కోట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల మొదటి వారంలో విడుదల కావాల్సిన నిధులు, కరోనా, భారీ వర్షాల కారణంగా కొంత జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బోర్డు సభ్యులు సదా కేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యులు ప్రభాకర్‌ రెండుసార్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి నిధుల విడుదల విషయంపై విజ్ఞప్తి చేశారు.  స్పందించిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక శాఖ కార్యదర్శికి నిధుల విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పరిపాలనా అనుమతులు మంజూరు కావడంతో వారం రోజు ల్లో సుమారు రూ.18కోట్ల విడుదల కానున్నాయి. గత నెలలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, బోర్డు అధికారులు, బోర్డు సభ్యులతో డిఫెన్స్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, బోర్డును ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ఈ ప్రాం తంలో అమలు చేసేందుకు ప్రణాళికలు సైతం రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగానే కేసీఆర్‌ కిట్‌లు కూ డా ఇక్కడ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదింపు లు చేశారు. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని బోర్డు పరిధి లో ప్రవేశపెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. 

ఫలించిన మంత్రుల కృషి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో కంటోన్మెంట్‌ బోర్డు కు నిధులు విడుదల కానున్నాయి. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా.. ఇక్కడ నివసించే ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తమపై ఉందని ప్రభుత్వం ముందడుగు వేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర నిధులపై బీజేపీ నేతలు నోరుమెదపరేం..?

బోర్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం  నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బకాయిల విడుదల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంది. ప్రభుత్వంతో నిరంతరం సమీక్షలు జరుపుతూ నిధులు రాబట్టేందుకు బోర్డు సభ్యులు కృషి చేస్తున్నా, ఇక్కడి బీజేపీ నేతలు నీతి వ్యాఖ్యాలు వల్లిస్తున్నారు. కేంద్రం నుంచి బోర్డుకు దాదాపు రూ.600 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నా నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. రావాల్సిన నిధులపై కనీసం మాట్లాడలేని నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని బోర్డు సభ్యులు వ్యాఖ్యానించారు.