బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Jun 10, 2020 , 02:07:10

ఇన్సూరెన్స్‌ ప్రీమియం పేరుతో రూ.10.88లక్షలు కాజేశారు

ఇన్సూరెన్స్‌ ప్రీమియం పేరుతో రూ.10.88లక్షలు కాజేశారు

హైదరాబాద్‌ : ఆగిపోయిన ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కొంత డబ్బు చెల్లిస్తే.. రూ.16 లక్షలు ఇస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు... ఓ వ్యక్తికి రూ.10.88లక్షలు టోకరా వేశారు.  మియా పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి 2016 నుంచి 10 ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుని.. వాటి ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. అయితే.. కొన్ని సంవత్సరాల కిందట వాటి చెల్లింపులు ఆపాడు. ఈ వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు.. 2019 ఫిబ్రవరి నుంచి 2020 జూన్‌ 8వ తేదీ వరకు సౌరబ్‌ రూపకిషోర్‌,రాజేశ్‌ తివారీ, అభినవ్‌ శుక్లా, రాధేశ్యాం, దీపక్‌ తివారీలు ఐఆర్‌డీఏ(ఇన్సూరెన్స్‌ రెగ్యూలేటరీ డెవలప్‌మెంట్‌ అథారటీ) ఉద్యోగులుగా అతనికి ఫోన్‌ చేసి... మీ పెండింగ్‌ ప్రీమియంలు చెల్లించకుండానే.. మీకు రూ.16 లక్షలు వస్తాయని నమ్మించారు. దీని కోసం మేము చెప్పినట్లు కొంత నగదు చెల్లించాలని... 17 నెలల పాటు వెంటబడి మొత్తం రూ.10.88 లక్షలను కాజేశారు. దీంతో బాధితుడు మంగళవారం  సైబరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


logo