గురువారం 28 మే 2020
Hyderabad - Apr 08, 2020 , 23:39:39

ఔదార్యంతో పేదలకు..

ఔదార్యంతో పేదలకు..

 • గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ, డబిల్‌పూర్‌లో దాతల సహకారంతో సేకరించిన బియ్యం, నిత్యావసర వస్తువులు కార్మికులు, పేదలు సుమారు వెయ్యి మందికి మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ గీతాభాగ్యారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నేత రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రజిత, వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, సహకార సంఘం చైర్మన్‌ సద్ది సురేశ్‌రెడ్డి  పాల్గొన్నారు. డబిల్‌పూర్‌లో పోలీసులకు శానిటైజర్‌, మాస్క్‌లు పంపిణీ చేశారు.  
 • ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపుతో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నిరుపేదలకు రూ.1.5లక్షలు విరాళంగా అందజేశారు. 
 • పేదలను ఆదుకునేందుకు నిత్యావసర వస్తువుల కిట్‌ను ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎమ్మెల్సీ ఎంఏ.సలీం ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పేదలకు పంపిణీ చేశారు.  
 • ఉప్పల్‌ నియోజకవర్గంలో పేదలు, కూలీలకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సరుకులు, కూరగాయలు, ఆహార పొట్లాలను అందజేశారు. 
 • శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆయా వార్డుల్లో దాతలు అందజేసిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేదలకు పంపిణీ చేశారు. 
 • జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సొంత ఖర్చుతో 4 శానిటేషన్‌ వాహనాలను సిద్ధం చేసి ప్రారంభించారు. నియోజకవర్గంలో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయడానికి వాహనాలు సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 
 • గోషామహల్‌లోని నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌ ఇంటింటా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తున్నారు. మూడు డివిజన్లలో 450బస్తాల బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని, ఆదిత్యకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామని నందకిశోర్‌ తెలిపారు. 
 • సెట్విన్‌ మాజీ చైర్మన్‌ మక్సూద్‌ అహ్మద్‌ సీఐబీ క్వార్టర్స్‌లో దాదాపు 350 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • బోరబండకు చెందిన యువకులు 10మంది తలా కొంత మొత్తాన్ని పోగు చేసుకుని పేదలు, యాచకులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మధ్యాహ్నం ఆహార పొట్లాలను అందజేశారు. బుధవారం ఒక్కరోజే సుమారు 500 మందికి పంపిణీ చేశారు. లడ్డు యాదవ్‌, అఖిల్‌గౌడ్‌, రాకేశ్‌యాదవ్‌, వేణు, కిశోర్‌, టోనీ, రాజు పాల్గొంటున్నారు. 
 • సోమాజిగూడలోని పార్కు హోటల్‌ వెనుక వైపున గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కూలీలకు ట్రాఫిక్‌ పోలీసులు నిత్యావసర సరుకులు అందజేశారు. వందమందికి పైగా కూలీలకు సరుకులను ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, పంజాగుట్ట ఏసీపీ గోవర్దన్‌ల చేతుల మీదుగా అందజేశారు.
 • హిమాయత్‌నగర్‌, చంద్రానగర్‌లో పేదలకు సరుకులను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు పంపిణీ చేశారు. 
 • గాంధీ దవాఖాన వైద్యులకు, వైద్య కళాశాల ల్యాబ్‌ టెక్నీషియన్లకు, సిబ్బందికి  ప్రతిరోజు వంద మందికి పోషకాహారంతో కూడిన భోజనం సమకూరుస్తున్నామని లక్ష్మీచంద్ర క్యాటరర్స్‌ యజమాని పసుపులేటి అశోక్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ అల్లం శ్రీనివాస్‌ తెలిపారు. 
 • న్యూబోయిగూడలో తాము పోగు చేసుకున్న డబ్బుతో బన్సీలాల్‌పేట్‌లోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో 350 మందికి భోజనం సమకూర్చారు. 
 • ఆల్విన్‌కాలనీ పరిధిలోని సాయినగర్‌ ఈస్ట్‌, వెస్ట్‌, ఆదిత్యానగర్‌, రాఘవేంద్ర కాలనీల్లో విప్‌ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌తో కలిసి స్వయంగా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేశారు. 
 • దిల్‌సుఖ్‌నగర్‌లో 250 పేద న్యాయవాదుల కుటుంబాలకు హైకోర్టు సీనియర్‌ న్యాయవాదులు రాపోలు భాస్కర్‌, గట్టు వామనరావు, నాగమణిల ఆధ్వర్యంలో రూ.5లక్షల విలువైన బియ్యం, నిత్యావసర సరుకులను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ  రాంచందర్‌రావు పంపిణీ చేశారు. 
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి ఇందిరమ్మకాలనీ పేజ్‌-1, 2లలో టేకుల సుధాకర్‌రెడ్డి, టేకుల నర్సింహారెడ్డి, టేకుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కొలన్‌గోపాల్‌రెడ్డి ప్రారంభించారు.
 • లాక్‌డౌన్‌ అమలులో భాగంగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు ప్రతిరోజు ఆనంద్‌బాగ్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ భోజన సౌకర్యం కల్పిస్తుంది. ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు కొనసాగించనున్నట్లు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గుండా నిరంజన్‌ తెలిపారు.
 • చైతన్యపురిలో వైశ్య వికాస వేదిక, వీ3 న్యూస్‌ చానల్‌ చైర్మన్‌ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో తయారు చేసిన 1500 శానిటైజర్‌ బాటిళ్లను ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌కు, ఎల్బీనగర్‌ జోన్‌ పోలీసు సిబ్బందికి కాచం సత్యనారాయణ అందజేశారు. 
 • రాఘవేంద్రకాలనీలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలనీ వాసులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
 • తోట నారాయణరెడ్డి కాలనీవాసులు డబ్బులు జమ చేసి మేయర్‌ పారిజాత, కార్పొరేటర్‌ శ్రీధర్‌రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్‌తో కలిసి మున్సిపల్‌ సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. 
 • శ్రీశృంగేరి జగద్గురు శ్రీభారతి తీర్థ మహాస్వామి ఆశీస్సులతో ఆర్కేపురం డివిజన్‌ అల్కాపురిలోని శ్రీశృంగేరి శంకర్‌ మఠం ఆధ్వర్యంలో పలువురికి ఆహార ప్యాకెట్లను అందజేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులకు నేటి నుంచి 14వ తేదీ వరకు ఆహార ప్యాకెట్లను అందజేస్తామని మఠం ధర్మకర్త కె.వి.శ్రీనివాస్‌, కమిటీ మెంబర్‌ గౌరీభాస్కర్‌ తెలిపారు.


 • ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అవుషాపూర్‌ పంచాయతీ కార్మికులకు శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేసి భోజనాన్ని ఏర్పాటు చేశారు. 
 • దమ్మాయిగూడ మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి కౌన్సిలర్‌ సంపనబోలు స్వప్న హరిగౌడ్‌, వేదాద్రినగర్‌ కాలనీ ఆధ్వర్యంలో 250 మందికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు.
 • నాగారం మున్సిపల్‌ పరిధిలోని 7, 8, 9 వార్డుల్లో కూలీలు, నిరుపేదలకు మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
 • కార్పొరేషన్‌ 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎడ్ల శ్రీనివాస్‌ రెడ్డి 200 మంది పేదలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేశారు.
 • తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్ల  ఆధ్వర్యంలో ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని సాయినగర్‌లో 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. డివిజన్‌ కార్పొరేటర్‌ పండాల సతీశ్‌ గౌడ్‌ వీటిని పంపిణీ చేశారు. 


logo