అప్రమత్తంగా ఉండాలి

- కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికపై టీఆర్ఎస్ నేతల సమీక్ష
- అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాలు
బంజారాహిల్స్: కౌంటింగ్ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండేవారినే ఏజెంట్లుగా నియమించుకోవాలని జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులకు నేతలు సూచించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో బుధవారం టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్ సమావేశమయ్యారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆరు సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో తేలినట్లు బాల్క సుమన్ అభ్యర్థుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు డివిజన్లలో పోటాపోటీగా ఎన్నిక సాగిందని, అయితే పోలింగ్ ముగిసే సమయానికి అక్కడ కూడా టీఆర్ఎస్కు ఆధిక్యత లభించిందని పేర్కొన్నారు. శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఒక్కో అభ్యర్థి 15 మంది ఏజెంట్ల నియమాన్ని పాటించాలని, కౌంటింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండేవారినే ఏజెంట్లుగా పెట్టుకోవాలని సూచించారు.
20 ఏండ్ల తర్వాత బ్యాలెట్ పత్రాలతో ఎన్నిక జరిగినందున కౌంటింగ్‌ను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉందన్నారు. టీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లకు గురువారం తెలంగాణ భవన్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్ల వారీగా సమీక్షించామని, అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. పోలింగ్ ముగియడంతోనే బాధ్యత తీరలేదని, కౌంటింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో టీయూఐఎఫ్సీ చైర్మన్ కె.విప్లవ్ కుమార్, టీఆర్ఎస్ అభ్యర్థులు గద్వాల్ విజయలక్ష్మి, మన్నె కవితారెడ్డి, కాజా సూర్యనారాయణ, హేమలతాయాదవ్, వనం సంగీతాయాదవ్, పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు