మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Nov 18, 2020 , 08:56:31

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు.. యథాతథం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు.. యథాతథం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత ఎన్నికల సందర్భంగా ఖరారుచేసిన రిజర్వేషన్లనే ఈ ఎన్నికల్లో కూడా యథాతథంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మంగళవారం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం రిజర్వేషన్లను రొటేషన్‌ పద్ధతిలో ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లను యథావిథిగా రెండు దఫాలు కొనసాగించాలని ఇటీవలే నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ కూడా చేసిన నేపథ్యంలో ఈ బల్దియా ఎన్నికల్లో కూడా గతంలో చేసిన రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది, బీసీలకు 50, జనరల్‌ మహిళలకు 44 వార్డులు రిజర్వు కాగా, మిగిలిన 44వార్డులు జనరల్‌(రిజర్వుకానివి) కేటగిరీలో ఉన్నాయి.